Konda Surekha: తన లవ్ స్టోరీ బయటపెట్టిన కొండా సురేఖ..విని ఆశ్చర్యపోయిన యాంకర్ సుమ ..!

Tue, 05 Nov 2024-6:35 pm,

ఒకప్పుడు ఎంతోమంది బుల్లితెర లేడీ యాంకర్స్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవారు.  కానీ సుమ ఎప్పుడైతే యాంకర్ గా ఇండస్ట్రీలకి అడుగు పెట్టిందో అప్పటినుంచి తెలుగు యాంకర్స్ హవా దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. తెలుగు చక్కగా మాట్లాడుతూ స్టార్ యాంకర్ గా పేరు సొంతం చేసుకుంది. దాదాపు 2  దశాబ్దాలకు పైగా బుల్లితెరపై స్టార్ స్టేటస్ తో కొనసాగుతోంది అంటే ఇక సుమ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

స్టార్ మహిళ, క్యాష్ దొరికినంత దోచుకో ఇలా ఎన్నో బుల్లితెర షోలకు యాంకర్ గా చేసిన ఈమె,  గతంలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.  అక్కడ గుర్తింపు రాకపోవడం వల్ల యాంకర్ గా సెటిలైంది అయితే ఈమధ్య కాలంలో జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు. 

ఇక ఇప్పుడు పలు సినిమా ఫంక్షన్ లకు హోస్ట్ గా చేస్తూ దూసుకుపోతున్న సుమా.. తాజాగా ఒక సినిమా ఫంక్షన్ లో భాగంగా కొండా సురేఖతో పెట్టుకున్న ముచ్చట్లు అందర్నీ నవ్వు తెప్పించాయి.   

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ ఇటీవల నాగార్జున, నాగచైతన్య, సమంతల విషయంలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ఇక వాటినుండి బయటపడక ముందే ఇప్పుడు యాంకర్ సుమతో సరదాగా కామెంట్లు చేసి అందర్నీ నవ్వించింది సురేఖ. 

సుమతో.. నా మరిది నీకు ఎప్పుడు ప్రపోజ్ చేశాడు..? ఎలా ప్రపోజ్ చేశాడు? అని అడగ్గా.. ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడు. దాంతో పెళ్లి చేసుకున్నామని సుమా చెప్పింది. ఏంటి ప్రపోజ్ చేయగానే పెళ్లి చేసుకున్నావా అని కొండా సురేఖ అడగ్గా.. లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ను ఒప్పించి పెళ్లి చేసుకున్నామంటూ సుమా తెలిపింది. 

మీకు బావ ఎలా ప్రపోజ్ చేశాడు అక్క అని సుమా అడగగా.. ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేయలేదు. నేరుగా పెళ్లి చేసుకుంటావా..అని చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళందరూ ఉండగానే బైక్ పైన వచ్చి రామ్మా అని కూర్చోబెట్టుకొని మరీ.. ఆ తర్వాత నా మెడలో తాళి కట్టాడు అంటూ కామెంట్ చేసింది. మొత్తానికైతే సుమ కొండా సురేఖ మధ్య సాగిన ముచ్చట్లు అందరిని ఆకట్టుకున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link