TS Summer Holidays: తెలంగాణలోని స్కూళ్ల కు రేపటి నుంచే సమ్మర్ హలీడేస్.. రీ ఓపెన్ ఎప్పుడో తెలుసా.?
ఎండలతో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఈసారి ఏప్రిల్ లోనే ఎండలు బీభత్సంగాఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్ద వయస్సుల వారుబైటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి కూడా ఇష్టపడటం లేదు.
కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే జనాలు బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం 3 వరకు ఎటు కూడా కదల్లేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో.. తెలంగాణ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే తెలంగాణలో అన్ని క్లాసులకు ఎగ్జామ్ లు పూర్తి అయిపోయాయి. ప్రైమరీ స్కూళ్లకు కొన్నిరోజులుగా ఒండిపూట పాఠశాలలు నడుస్తున్నాయి. బైట ఎండ ప్రభావానికి విద్యార్థులు కూడా ఎంతో ప్రభావానికి గురౌతున్నారు.
ఈక్రమంలో స్కూళ్లు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సమ్మర్ సెలవులను ప్రకటించాయి. ఈ సెలవుల్లో ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. రేపటినుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వ తేదీ వరకు ఎండాకాలం సెలవులు ఉండనున్నాయి.
పాఠశాలలకు దాదాపుగా యాభై రోజుల పాటు సమ్మర్ హలీడేస్ లు ప్రకటించాయి. ఈమేరకు.. తెలంగాణ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్ కే లింగయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక మరోవైపు సీబీఎస్ఈ స్కూళ్లకు ఏప్రిల్ 20 నుంచి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అదే విధంగా హలీడేస్ లలో విద్యార్ధులు ఎండలో బైటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. ముఖ్యంగా ఎండ ప్రభావం వల్ల శరీరం ఒక్కసారిగా డీహైడ్రేషన్ కు గురిఅయిపోతుంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముందు జాగ్రత్తలు తీసుకొవాలని కూడా అధికారులు సూచించారు. అదే విధంగా స్కూల్స్ ఓపెన్ అయ్యాక.. కూడా హలీడేస్ లిస్ట్ ను కూడా అధికారులు ప్రకటించారు.