TGPSC Group-2: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.... మరోసారి గ్రూప్-2 వాయిదా.. ?.. కారణం ఏంటంటే..?
తెలంగాణలో ప్రస్తుతం వరుసగా గ్రూప్స్ ఎగ్జామ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలీమ్స్ తో పాటు,గ్రూప్ 3 ఎగ్జామ్ లు సైతం పూర్తయిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సర్కారు ఎగ్జామ్ లను పకట్భందీగా నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించినట్లు తెలుస్తొంది.
గతంలో ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్ లు పలు మార్లు వివిధ కారణాలలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ ల తేదీలను కొన్ని రోజుల ముందు టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే.. డిసెంబర్ 15,16 వ తేదీల్లో గ్రూప్స్ 2 ఎగ్జామ్ లు జరగనున్నాయి.
ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ లకు గాను హల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్ లోడ్ చేసుకొవచ్చని వెల్లడించింది. రెండు రోజుల పాటు ఈ ఎగ్జామ్ లు జరగనున్నాయి. దాదాపు.. 783 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది.
పరీక్షల తేదీ, సమయం : డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్ 3,4 నిర్వహించనున్నారు.
అయితే.. డిసెంబర్ 16,17,18 తేదీల్లో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ లు ఉన్నట్లు తెలుస్తొంది. ముఖ్యంగా జూనియర్ ఇంజనీరింగ్ విభాగం, టెక్నికల్ విభాగంలో దేశ వ్యాప్తంగా ఎగ్జామ్ లు జరగనున్నట్లు సమాచారం.ఈ ఎగ్జామ్ కు కూడా అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు తెలుస్తొంది. దీంతో రెండు నోటిఫికేషన్ లు సైతం కొన్నేళ్ల తర్వాత వెలువడ్డాయి. ఒక వైపు తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ మరోవైపు, ఆర్ఆర్ బీ ఎగ్జామ్ లు ఒకే రోజు ఉండటంతో నిరుద్యోగ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారంట.
అయితే.. ఆర్ఆర్బీ ఎగ్జామ్ లు దేశ వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి వాటి తేదీలను మార్చేందుకు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి తెలంగాణలోని గ్రూప్ 2 ఎగ్జామ్ లను వాయిదా వేసి.. తమకు న్యాయం చేయాలని గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం టీజీపీఎస్సీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు.