Post Office Saving Scheme : SBI కంటే అధిక వడ్డీ..పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ ఇదే..రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్
Post Office Saving Scheme : చాలా మంది రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు బాగుండాలంటే మంచి స్కీముల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే ఈ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తుకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. అందుకే చాలా మంది సురక్షితమైన, స్థిరమైన రాబడికోసం ఎన్నో స్కీములు అందుబాటులో ఉన్నాయి.
నేడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అనేక పెట్టుబడి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి పోస్టాఫీస్. పోస్టాఫీస్ ఇప్పుడు అనేక రకాల పెట్టుబడి స్కీములను చురుకుగా అమలు చేస్తోంది.
పోస్టాఫీస్ తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన స్కీములను అమలు చేయడమే కాకుండా దేశంలోని పెద్ద బ్యాంకుల కంటే ఎక్కువ రాబడిని అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐ కంటే పోస్టాఫీస్ 5ఏళ్ల ఎఫ్డీ స్కీముపై 1శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.
పోస్టాఫీస్ 5ఏళ్ల టీడీపై 7.5శాతం వడ్డీ అందిస్తోంది. అంటే మీ వయస్సుతో సంబంధం లేకుండా దాని కస్టమర్లందరికీ టైమ్ డిపాజిట్ సౌకర్యం అందిస్తోంది. పోస్టాఫీసు TD పథకం బ్యాంకులు నిర్వహించే FD స్కీమ్‌ను పోలి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వలే టైమ్ డిపాజిట్ లో పెట్టుబడిదారులు కూడా నిర్ణీత వ్యవధి తర్వాత స్థిరమైన హామీతో కూడిన రాబడిని పొందుతారు.
ఉదాహరణకు, మీరు సీనియర్ సిటిజన్ కానట్లయితే.. SBIలో 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ లో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీలో మీరు మొత్తం రూ. 6,90,209 లక్షలు పొందుతారు. మరోవైపు, మీరు అదే మొత్తాన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే, మీరు మెచ్యూరిటీపై మొత్తం రూ.7,24,974 పొందుతారు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే పోస్టాఫీసులో మీకు రూ.34,765 ఎక్కువ లభిస్తుంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీములో అకౌంట్ తెరిచేందుకు పలు కాలపరిమితులతో లాక్ ఇన్ పీరియర్ ఉంటుంది. ఒకటి రెండు, మూడు, ఐదేళ్ల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. కాల వ్యవధిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. పోస్టాఫీసుకు అధికారికంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది.