Immunity Tips: రోగనిరోధక శక్తిని పెంచే ఇంటి చిట్కాలు
పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. జలుబు, దగ్గు తగ్గుతుంది. గోరువెచ్చని పాలల కాస్త పసుపు కలిపి తాగడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎముకలకు కూడా బలం చేకూరుతుంది.
లవంగాల వల్ల జలుబు, దగ్గు తగ్గడమే కాదు ఇన్ఫెక్షన్స్ కూడా మాయం అవుతాయి. అదే సమయంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాంతిని పెంచుతుంది.
తులసి, అల్లం మిశ్రమం చాలా శక్తివంతమైనది. ఈ మిశ్రమం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తగ్గుతుంది.
పోపులు డబ్బాలో ఖచ్చితంగా ఉండే మసాలా దినుసు దాల్చిని చెక్క.ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివి.
ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. దాంతో పాటు కాల్షియం, ఆర్సెనిక్, ఫాస్ఫోరస్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కార్బో హైడ్రేట్స్ మెండుగా ఉంటాయి. ప్రతీ రోజు ఆమ్లా తినడం వల్ల ఎన్నో రోగాల నుంచి కాపాడుకోవచ్చు.