Tirumala: పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయం..
తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుడు పెద్ద శేష వాహనంపై మొదటిరోజు అయిన శుక్రవారం నాడు స్వర్ణ శేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులను కనువిందు చేశాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలమంది భక్తులు తిరుమలకు చేరుకుని వేంకటేశుని దర్శనం కోసం కొన్ని గంటలపాటు బారులు తీరతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారే మాడవీధుల్లో స్వర్ణ శేష వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశాడు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు.
ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. ఆయన లక్ష్మణుడిగా,బలరాముడిగా శ్రీమన్నారాయణుడిగా నిత్యం తోడుగా ఉన్నాడు. స్వామివారిని సేవిస్తూ భక్తి చాటుకున్నాడు.
కాగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం 14 కళాబృందాలు 410 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో ఒడిస్సీ, మయూర, యక్షగానం, వీరగాశ, విద్యార్థులు కోలాటలతో ప్రదర్శనలు చేసి మంత్ర ముగ్దులను చేశారు.
ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వామి వారిని దర్శించుకుని సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించారు.తిరుమల పుణ్య క్షేత్రంలో కేవలం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలన్నారు.
అంతేకాదు భక్తులకు అన్ని సౌకర్యాలు తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. టీటీడీ యాజమాన్యం కూడా పారిశుద్ధ్యం, ప్రసాదం వంటి సౌకర్యాలను కల్పిస్తుంది. భక్తులు వినియోగించుకోవాలని కోరారు.