Chamomile Tea: చామంతి టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే!
చామంతి టీలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంగ్జయోలిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ టీ తీసుకోవడం వల్ల సుఖమైన నిద్ర పొందవచ్చు.
చామంతి టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, వాంతులు, విరేచనాలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
చామంతి టీ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నవారు ఈ టీ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చామంతి టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చామంతి టీకి నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి, పీరియడ్ నొప్పి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.