Union Budget 2024: సామాన్యులకు మోడీ బంపరాఫర్.. ఒక్కో కుటుంబానికీ నేరుగా రూ. 10 లక్షలు..
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరి 1వ తేదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇక ఎన్నికల పూర్తైయి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో త్వరలో 2024 -25 కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు.
రాబోయే బడ్జెట్ తో సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్రం బడ్జెట్ రూపొందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యుల ఆదాయ పన్ను పరిమితితో పాటు పాటు ఆరోగ్య సంరక్షణకు విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించనున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే.. 70 యేళ్ల పైబడిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కు ఆదాయ పన్నుతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
అందులో భాగంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సామాన్యులకు ఊరట కలిగించేలా.. కేంద్ర బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల బీమా కవరేజిని రూ. 10 లక్షలు పెంచబోతున్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి యేడాదికి రూ. 10 లక్షల బీమా కవరేజితో పాటు దాదాపు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు చేసుకోవడానికి సామాన్యులకు ఉపయోగపడనుంది.
ఆయుష్మాన్ భారత్- ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద వచ్చే మూడేళ్లలో లబ్బి దారులను డబుల్ చేసే యోచనలో ఉన్నట్టు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది.
కొత్తగా కొలువు దీరిన 18వ లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో నా ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 55 కోట్ల లబ్ధిదారులు ఉచిత ఆరోగ్య సేవలు పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు దేశ్ వ్యాప్తంగా 25 వేల జన్ ఔషది కేంద్రాలను ప్రారంభించినట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అంతేకాదు ఇప్పుడు 70 ఏళ్లు నిండిన ప్రతి భారతీయులకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఉచిత చికిత్స అందించబడుతుందని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రత్వ శాఖ డేటా ప్రకారం ఇప్పటి వరకు 12 జనవరి 2024 వరకు 30 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసినట్టు పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024 -25ను జూలై 23న లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు 22 జూలై ప్రారంభమై.. 12 ఆగష్టు 2024 వరకు కొనసాగనున్నాయి.