Valentine day 2024: నిహారిక, సమంత, చైతూ, పవన్ సహా టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..
నాగ చైతన్య - సమంత: టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు ఎంతో వేగంగా పెళ్లి చేసుకున్నారో.. మనస్పర్ధల కారణంగా విడిపోయారు.
నాగార్జున - లక్ష్మి: నాగ చైతన్య, సమంత బాటలో.. చైతూ తల్లిదండ్రైలన నాగార్జున, లక్ష్మిలు కూడా పరస్పర అంగీకారంతో విడిపోయారు.
సుమంత్ - కీర్తి రెడ్డి: సుమంత్, కీర్తి రెడ్డిలు పెళ్లైన కొన్ని రోజులు తర్వాత వీరు విడిపోయారు.
నిహారిక - చైతన్య జొన్నలగడ్డ: మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అప్పట్లో ఘనంగా జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏవో విభేదాల కారణంగా విడిపోయారు.
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్: అటు కూతురు నిహారిక కంటే ముందు పవన్ కళ్యాణ్ విషయంలో మూడు పెళ్లిళ్లు ఎపుడు చర్చకు వస్తుంటాయి. అందులో మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు.
కమల్ హాసన్: కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ కంటే ముందు తన ఇద్దరు భార్యలైన వాణీ గణపతి, సారికకు విడాకలు ఇచ్చారు.
నరేష్ - పవిత్రా లోకేష్: నరేష్ ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. అటు పవిత్ర లోకేష్ కూడా తన మాజీ భర్తలకు విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరు ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు.
మంచు మనోజ్ : మంచు మనోజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఏదో తెలియని కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత రెండో వివాహాం చేసుకున్నారు.
సౌందర్య రజినీకాంత్ : సౌందర్య రజినీకాంత కూడా మొదటి భర్తతో విభేదాల తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. విడాకుల తీసుకున్న సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.