Varun Teja-Lavanya: బేబీ బంప్ తో మెగా కోడలు.. ఫొటోస్ వైరల్..!
మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న.. ఈయన తోటి నటి లావణ్యను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వివాహం అనంతరం ఎక్కడా కూడా ఈ జంట పెద్దగా మీడియా ముందుకు రాలేదు. కానీ ఉన్నట్టుండి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు.. ఫోటోలు వైరల్ అయ్యాయి.
మంగళవారం రాత్రి కొండపై బస చేసిన ఈ మెగా జంట బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదిలా ఉండగా గత ఏడాది జూన్ నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరు, అదే ఏడాది నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే అప్పటికే పెండింగ్లో ఉన్న మొక్కులు తీర్చుకోవడానికి వీరికి సమయం కుదరలేదు. కానీ ఇప్పుడు కాస్త సమయం దొరకడంతో తన భార్య లావణ్యతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారడంతో ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్ లావణ్య ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆమె తన బేబీ బంప్ ను కవర్ చేస్తూ చేతులు ఫోల్డ్ చేయడం ఆ ఫోటోలలో మనం చూడవచ్చు. పట్టు వస్త్రాలలో చూడ చక్కగా మెరిసిన ఈ జంట ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలలో లావణ్య బేబీ బంపుతో కనిపిస్తోంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక అందులో భాగంగానే మెగా కోడలు ప్రెగ్నెంట్ అంటూ..కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట ఫోటోలైతే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి అందులో స్పష్టంగా అయితే బేబీ పంపు కనిపించలేదు కానీ లావణ్య తన పొట్ట పైన చేతులు పెట్టుకొని ఉన్న ఫోటోలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.