Kitchen Vastu Tips: కిచెన్‌లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, అదృష్టాన్ని మార్చేసే శక్తివంతమైన సూచనలు
గ్యాస్ స్టౌవ్, బర్నర్ ఎప్పుడూ మంచి స్థితిలో ఉండేట్టు చూసుకోవాలి. దాంతోపాటు గ్యాస్ స్టౌవ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. విరిగిపోయి, వ్యర్ధాలతో నిండిపోయి ఉండకూడదు. స్టౌవ్ ఈ స్థితిలో ఉంటే పేదరికానికి సంకేతం.
ఇంట్లో తాగునీరు అమర్చుకునే బెస్ట్ ప్లేస్ తూర్పు దిశే. తాగునీరు, గిన్నెలు కడిగే స్థానం ఈ దిక్కునే ఉండాలి. ఎప్పుడూ దక్షిణ తూర్పు దిశలో నీళ్లు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల హానికలగవచ్చు.
కిచెన్‌లో ఎప్పుడూ చీపురు ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి వ్యాపిస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. ఇంట్లో ధన సంపదలు తగ్గిపోతాయి. ఇటువంటి ఇంట్లో పేదరికం తాండవిస్తుంది.
భోజనం వండిన తరువాత వండిన ఆహారాన్నికుడివైపునే ఉంచాలి. ఎడమవైపుంచడం మంచిది కాదు. దీనివల్ల కుటుంబం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అంతేకాకుండా రాత్రివేళ ఎప్పుడూ కిచెన్‌లో ఎంగిలి గిన్నెలు వదిలితే రాహుదోషం ఏర్పడుతుంది. ఇంటి బాత్‌రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. జీవితంలో చాలా కష్టాలు ఎదురౌతాయి.
కిచెన్‌లో ఓపెన్ డస్ట్ బిన్స్ ఎప్పుడూ వినియోగించకూడదు. ఎప్పుడూ డస్ట్ బిన్ మూసి ఉంచాలి. దీనివల్ల ఇంట్లో అనారోగ్యం వ్యాపించడమే కాకుండా..ఇంట్లో నెగెటివ్ శక్తులు కూడా ప్రసరిస్తాయి.
వాస్తుశాస్త్రం నియమాల ప్రకారం..భోజనం వండేటప్పుడు ఎప్పుడూ తూర్పు దిశవైపే ఉండాలి. కిచెన్‌లో గ్యాస్ స్టౌవ్ ఆ విధంగా ఉండాలి. అంటే వంట వండే వ్యక్తి ముఖం తూర్పు దిక్కువైపుగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బులకు కొదవ ఉండదు.