Vivo V20 Pro 5G smartphone price and features: వివో వి20 ప్రో 5జి అత్యంత స్లిమ్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

Fri, 27 Nov 2020-3:46 am,

వివో 5 జి స్మార్ట్‌ఫోన్‌ విపణిలోనే అత్యంత స్లిమ్‌గా ఉండే వివో వి20 ప్రో స్మార్ట్‌‌ఫోన్ డిసెంబర్ 2న లాంచ్ కానున్నట్టు వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ తాజాగా ప్రకటించింది.

వివో గత నెలలోనే వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇక ఇప్పుడు, ఇదే మోడల్ నుంచి ప్రో వెర్షన్‌ను దేశంలో విడుదల చేయడానికి వివో కంపెనీ సన్నద్ధమవుతోంది. వివో ఇప్పటివరకు విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో ఇదే అత్యంత స్లిమ్ ఫోన్ కానున్నట్టు వివో తెలిపింది.

వివో వి20 ప్రో స్మార్ట్ ఫోన్ మోడల్ గురించి కంపెనీ గత కొద్ది రోజులుగా టీజర్స్ విడుదల చేస్తూ వివో యూజర్స్‌ను ఊరిస్తూ వస్తోంది కానీ ఈ మోడల్ గురించి మరే ఇతర వివరాలను వెల్లడించడం లేదు.

అయితే, కంపెనీ విడుదల చేస్తూ వస్తున్న వివో వి20 ప్రో మొబైల్ ఫోటోలను గమనిస్తే.. అది పెంటా-కెమెరా సెటప్‌తో డిజైన్ అయినట్టు మాత్రం స్పష్టమవుతోంది. ఇది ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని కంపెనీ విడుదల చేసిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్ నిలువుగా పేర్చబడిన దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో అమర్చారు.

Vivo V20 Pro ముందు భాగంలో, ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో డిజైన్ చేశారు. ఐఫోన్ ముందు భాగంలో ఉన్న నాచ్ తరహాలో ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉండనుందని అర్థమవుతోంది. ఒకే తేడా ఏమిటంటే, దీని ఫ్రంట్ క్యామ్ సెటప్ ఐఫోన్‌లలో లభించే దానికంటే చిన్నదిగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి గ్రే కలర్ వేరియంట్ కాగా మరొకటి పింక్, బ్లూ హ్యూ కాంబినేషన్‌లో లభించనుంది.

ఇప్పటికే వివో నుంచి వివో 20 ప్రో 5 జి మొబైల్‌ని కొన్ని ఇతర దేశాలలోని మార్కెట్లలో విడుదల చేసింది. విడుదలైన చోట ఈ ఫోన్‌ని పరిశీలిస్తే.. 6.44-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్ప్లేతో ఇన్-స్క్రీన్ వేలిముద్ర సెన్సార్‌తో వస్తోంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితో పాటు 8 జిబి RAM, 128GB స్టోరేజ్ స్పేస్ కలిగి ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 వెర్షన్‌తో నడుస్తుంది.

64 మెగాపిక్సెల్ ప్రైమరి సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. ముందు భాగంలో ఫోన్ 44 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్-లెన్స్ కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,000 mah బ్యాటరీని కలిగి ఉంది.

భారత మార్కెట్‌లో వివో వి20 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండనుందనే వివరాలను ప్రస్తుతానికి వివో కంపెనీ గోప్యంగానే ఉంచుతోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌పై స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌లో ( Smartphone users ) మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది.

Also read : Money deposits in accounts: 18 ఏళ్లు నిండిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1,30,000 ?

Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link