Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

Mon, 14 Dec 2020-6:09 pm,

Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ చేయాలని అతడి ఫ్యాన్స్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌కు మాత్రమే ఓటేయండి అంటూ సైతం కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అవుతాడని ఫ్యాన్స్  భావిస్తున్నారు. అయితే అభిజిత్‌కు హాట్ స్టార్ ద్వారా, బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా అభిజిత్‌ను విన్నర్ చేయవచ్చు.

అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204

Also Read : SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో అభిజిత్ పేరు మార్మోగిపోయేలా రికార్డ్ ట్వీట్లు (#WeAdmireAbijeet) చేశారు. మరోవైపు ఫ్యాన్స్ మద్దతోనే అభిజత్ బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో చివరి అడ్డంకిని దాటేసి ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!

టాప్ 1 అఖిల్

టాప్ 2 సోహైల్

టాప్ 3 అభిజిత్

టాప్ 4 హారిక

టాప్ 5 అరియానా

అతి తక్కువ సమయంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అభిజిత్ (Abhijeet) ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ట్రెండ్ క్రియేట్ చేశారు. 24 గంటల వ్యవధిలోపే అభిజిత్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌తో 5లక్షలకు పైగా ట్వీట్లు చేయడం గమనార్హం. ఇప్పుడు ఫైనల్ కావడంతో బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్‌గా అభిజిత్‌ను చేసేందుకు ఓటింగ్ ఉద్యమం మొదలుపెట్టారు.

అభిజిత్ నిజాయితీ గల మనిషి అని, ఎవరినీ నొప్పించే రకం కాదంటూ సాఫ్ట్ కార్నర్ క్యాంపెయిన్ సైతం ఫ్యాన్స్ ప్రారంభించారు. ఓట్లు ఈసారి హారికకు వెళ్లకూడదని, కేవలం అభి ఫ్యాన్స్ అభిజిత్‌కు మాత్రమే ఓటింగ్ చేయాలని పోస్టులు చేస్తున్నారు.

అభిజిత్ విజయాన్ని విదేశాలలోని బిగ్ బాస్ తెలుగు 4 ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. అభిజిత్‌కు హాట్ స్టార్ యాప్‌లోగానీ, లేక బిగ్ బాస్ ఇచ్చిన ఓటింగ్ నెంబర్‌కు శుక్రవారం రోజు అర్ధరాత్రి వరకు ప్రతిరోజూ 10 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చి 10 ఓట్లు వేయవచ్చు.

అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204  ఈ నెంబర్‌కు 10 మిస్డ్ కాల్స్ ఇస్తే రోజూ 10 ఓట్లు వేయవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link