Tirumala: మీ ఇంట్లో ధన వర్షం కురువాలా? తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకుంటే చాలు

Sat, 14 Sep 2024-9:52 am,

Lord Venkanna: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఆపద మొక్కుల వాడు, ఆనాధ రక్షకుడిగా శ్రీవారిని దర్శించుకుని ముక్కులు సమర్పించుకుంటారు. చాలా మంది కాలినడకన స్వామివారిని దర్శించుకుంటారు. వారాలతో, వర్జ్యాలతో ఎలాంటి సంబంధం లేకుండా స్వామివారిని కనులారా వీక్షించేందుకు బారులు తీరుతుంటారు. అయితే తిరుమల శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే మీకు మంచిది..ఏ రోజున దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి పండితులు ఏం చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఏ రోజు స్వామివారిని దర్శించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

శ్రీవారిని వారంలో ఒక్కొక్కరోజు దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.   

ఆదివారం: ఆదివారం స్వామివారిని దర్శించుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడంతోపాటు రాజకీయం పురోగతి లభిస్తుంది. 

సోమవారం : సోమవారం స్వామివారిని తిరుమల క్షేత్రంలో దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్షకాలిక అనారోగ్య సమస్యలు తీరుతాయి. పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైన తగ్గుతాయని చెబుతున్నారు. 

మంగళవారం: మంగళవారం ఆపద మొక్కులవాడిని దర్శించుకుంటే రుణబాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే మంగళవారం దర్శించుకోవాలి.   

బుధవారం: స్వామివారిని బుధవారం దర్శించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్న పిల్లలకు మంచి విద్య లభిస్తుంది. చదువులో వెనకబడిన పిల్లలు బుధవారం స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని చెబుతున్నారు. 

గురువారం: ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహసమస్యలు తొలగిపోతాయి. వయస్సు మీదపడుతున్నా వివాహం కాని వారు ఎందరో ఉన్నారు. గురువారం స్వామివారిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. పిల్లలు కానీ వారు కూడా ఈ రోజు స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది. 

శుక్రవారం: ఈ రోజు ఆ ఆపద మొక్కులవాడిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అద్రుష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లో  కనక వర్షం కురస్తుందని నమ్ముతుంటారు. 

శనివారం: ఈరోజు వడ్డీ కాసుల వాడిని దర్శించుకంటే నవగ్రహ దోషాలు తొలగుతాయి. ఆకలి బాధల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతుంటారు.   

Note: పైన తెలిపిన వివరాలు కొంతమంది జ్యోతిష్య పండితులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారలు లేవన్న విషయాన్ని గుర్తించాలి. దీనికి జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి సంబంధం లేదని..ఎంత వరకు విశ్వసించాలి అనేది మీ వ్యక్తిగత విషయం మాత్రమే. గమనించగలరు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link