Saturday Astrology: ఏలినాటి శని ఉన్నవారు శనివారం ఈ పనులు చేస్తే మంచిది..!
ఏలినాటి శనితో బాధపడేవారు తప్పకుండా ప్రతి శనివారం శని దేవుడిని పూజించడం చాలా ముఖ్యం. ఈ రోజు శని దేవుడికి నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలు సమర్పించడం మంచిది.
శనివారం రోజు ఏలినాటి శనితో బాధపడేవారు శని దేవుడికి నవగ్రహ శాంతి, శని దోష నివారణ పూజలు చేయించుకోవడం కూడా మంచిదని జోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా శనివారం హనుమాన్ జయంతి అయితే హనుమంతుడిని కూడా పూజించడం మంచిది. అలాగే ఈ రోజు ఆయనకు తమలపాపు మాలను సమర్పించడం శుభప్రదం.
శనివారం రోజున పేదలకు దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని జోతిష్యులు చెబుతున్నారు. దానం చేయడం వల్ల శని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.
శనివారం రోజు నల్లటి వస్త్రాలు, నూనెతో పాటు నువ్వులు, గోధుమలు, బెల్లం వంటివి దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది.
శనివారం శని వ్రతం ఆచరించడం వల్ల శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏలినాటి శని ఉన్నవారు ఈ వ్రతాలు చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.