Actresses Breakfast: మన తెలుగు హీరోయిన్స్ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటారు తెలిస్తే షాక్..!
సౌత్ స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలామంది హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ అదే అందం మెయింటైన్ చేస్తూ మంచి ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరి ఈ సెలబ్రిటీలు ఇంత ఫిట్ గా యంగ్ గా కనిపించడానికి కారణం వారు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఆహారమే అని చెబుతున్నారు. మరి మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం.
సమంత బ్రేక్ ఫాస్ట్..
సమంత తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే.. తాజా పండ్లను ఆమె ఎక్కువగా తీసుకుంటారు. ఒక బౌల్ తీసుకొని, అందులో అరటి పండ్లు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలు, తరిగిన బాదం, పిస్తా అలాగే చియా గింజలను అన్నింటిని ఒక బౌల్ లో వేసుకొని,ఉదయం అల్పాహారంలో తీసుకుంటుందట. వీటి వల్ల విటమిన్లు, ఫైబర్ అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో లభిస్తాయి. అందుకే తాను ఇంత ఆరోగ్యంగా, యంగ్ గా ఉండడానికి కారణం అని చెప్పుకొచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ బ్రేక్ ఫాస్ట్..
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిన విషయమే. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ విషయంలోనే కాదు ఆరోగ్య విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా అల్పాహారం సరైనదైతే ఆరోగ్యం రెట్టింపు అవుతుందనేది ఆమె విశ్వాసం. ఇక ఉదయాన్నే ఆమె ఒక స్మూతీ తయారు చేసుకుంటుందట. కొబ్బరి పాలు, నీరు, ప్రోటీన్ పౌడర్, అవిసె గింజలు, యాలకులు, అరటిపండు అన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్టులా చేసి దీనిని తాగుతుందట.
రష్మిక మందన్న బ్రేక్ ఫాస్ట్..
పుష్ప 2 సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఉదయాన్నే గుడ్లు, పాలకూర , పుట్టగొడుగులు, నువ్వుల నూనె ఉపయోగించి స్పెషల్ ఆమ్లెట్ సిద్ధం చేసుకుంటుందట. పాన్ వేడి చేసి అందులో పాలకూర, పుట్ట గొడుగులు, కొద్దిగా నువ్వుల నూనె వేసి వేయించాలి. ఇలా సిద్ధమైన మిశ్రమం లో గుడ్డు వేసి ఆమ్లెట్ లాగా వేసుకుంటుందట. ఇది తన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.
నయనతార బ్రేక్ ఫాస్ట్..
ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాల కు పైగానే అవుతున్నా ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అందర్నీ అలరిస్తున్న ఈమె బ్రేక్ ఫాస్ట్ లో కొబ్బరి స్మూతీ చేసుకొని తింటుందట. దీనికోసం కొబ్బరి పాలలోకి చిటికెడు యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా చక్కెర వేసి కలిపి తాగుతుందట.