Radha Ashtami 2024: రాధా అష్టమి శుభసమయం ఎప్పుడు? ఈ పనిచేస్తే ఎన్నోరెట్ల పుణ్యఫలం..

Tue, 10 Sep 2024-12:16 pm,

Radha Ashtami Muhurat And Timings: రాధ లేనిదే శ్రీ కృష్ణుడు లేదు, శ్రీకృష్ణుడు లేదు. అందుకే వారిద్దరినీ కలిపి రాధాకృష్ణులని పిలుస్తారు. అయితే, ఆగష్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించారు. ఇది జరిగిన 15 రోజులకే రాధా అష్టమి నిర్వహిస్తారు. ఈ శుభ సమయం ఎప్పుడు? తెలుసుకుందాం.  

ప్రతి ఏడాది భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి రోజు రాధా అష్టమి నిర్వహిస్తారు. అయితే, చాలా వరకు కృష్ణ అష్టమిని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కానీ, రాధా అష్టమి కొంతమందికి తెలియదు. కానీ, ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు.  

రాధా అష్టమి ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న బుధవారం అంటే రేపు రానుంది. రాధా అష్టమి శుభ ముహూర్తం ఈ రోజు రాత్రి 11:54 నుంచే ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎన్నో రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏ కోరిక కోరినా త్వరగా నెరవేరుతుందని పండితులు చెబుతుంటారు.  

ముఖ్యంగా ఈరోజున రాధాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలో పసుపు, కుంకుమ, అక్షితలు, ధూపం, దీపం, స్వీట్లు, చందనం, పండ్లు కచ్చితం. ఎందుకంటే ఇవి రాధమ్మకు ఎంతో ఇష్టం. అంతేకాదు పూజ సమయంలో ఈరోజు రాధా ఆర్తిని కూడా పఠించాలి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link