Chiranjeevi: చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా ?

Wed, 25 Nov 2020-9:22 am,

ఆచార్య మూవీ తర్వాత చిరంజీవి మరో రెండు రీమేక్ సినిమాలకు సైన్ చేశారు. అందులో ఒకటి మళయాళంలో మోహన్ లాల్ చేసిన లూసిఫర్ కాగా మరొకటి తమిళంలో అజిత్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెదళం సినిమా. సరిగ్గా ఇదే అంశం ప్రస్తుతం చిరంజీవి అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోందంట.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఆచార్య ( Acharya movie ) ఒక్కటి మాత్రమే డైరెక్ట్ సినిమా. మిగతా రెండు చిత్రాల్లో ఒకటి కోలీవుడ్ నుంచి వెధళం ( Vedhalam telugu remake ) అయితే మరొకటి మాలీవుడ్ నుంచి వచ్చిన లూసిఫర్ రీమేక్ ( Lucifer telugu remake ).

చిరంజీవి  దాదాపు దశాబ్ధకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేకే. 

ఖైదీ నెంబర్ 150 మూవీ తర్వాత చిరంజీవి చేసిన సినిమా సైరా. తెలుగునాట తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ( Uyyalawada Narasimha Reddy biobic ) రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగాస్టార్ ఆడియెన్స్‌కి ఐ ఫీస్ట్ అందించారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మెగాస్టార్‌లో దూకుడు ఏంటో చూపించింది. 

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలపైనే ఆధారపడ్డారంటే.. మన తెలుగు దర్శకులు చెప్పిన కథలు ఆయనకు నచ్చడం లేదా ? లేక వారి కథలపై నమ్మకం లేకనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా కాదంటే.. తనపై తాను ఏదైనా అభద్రతా భావంతో ఉన్నారా అనేవాళ్లు కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా చిరంజీవి ( Chiranjeevi ) స్టామినా ఏంటో అభిమానులు, ఆడియెన్స్‌కి తెలిసిన విషయమే. అందుకే ఆయన రీమేక్స్ గురించి ఆందోళన పడే వారి కంటే ఎక్కువగా.. ఆయన తల్చుకుంటే మరిన్ని స్ట్రెయిట్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టగలరనే నమ్మకం ఉన్న వాళ్లే ఎక్కువున్నారు. 

Also read : Mandana Karimi: దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వచ్చాడు

Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link