Whatsapp Accounts Blocked: ఆ 50 లక్షల భారతీయ ఎక్కౌంట్లు ఎందుకు బ్లాక్ అయ్యాయి
జూన్ 16 నుంంచి జూలై 31 మధ్యకాలంలో దాదాపు 30 లక్షల ఎక్కౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఆ నెలలో 594 ఫిర్యాదులు అందాయి. నిషేధిత కంటెంట్‌ను షేర్ చేసినందున ఈ చర్యలు తీసుకుంది.
ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల ఎక్కౌంట్లను తొలగించగా..అందులో భారతీయులవే 20 లక్షలకు పైగా ఉన్నాయి. 420 ఫిర్యాదుల్ని పరిశీలించిన అనంతరం 41 ఎక్కౌంట్లపై తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.
నిషేధిత 20 లక్షల 70 వేల అక్కౌంట్లలో ఎక్కువగా బల్క్ మెస్సేజ్‌లను అనధికారికంగా వాడినందున ఆ ఎక్కౌంట్లను నిషేధించామని వాట్సప్ వెల్లడించింది.
ఇందులో భాగంగా ఒక్క ఆగస్టు నెలలోనే 20 లక్షలకు పైగా భారతీయుల ఎక్కౌంట్లను నిషేధించామని వాట్సప్ తెలిపింది. ఆగస్టు నెలలో 420 ఫిర్యాదులు వచ్చాయని మంత్లీ కంప్లయెన్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
2021 మే నెలలో అమల్లో వచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాట్సప్ ఎప్పటికప్పుడు నివేదిక వెలువరిస్తోంది. ఎప్పటికప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎక్కౌంట్లను నిషేధిస్తోంది. లక్షలాది ఎక్కౌంట్లను ఇప్పటి వరకూ బ్లాక్ చేసింది వాట్సప్.