Liquor shops: మందుబాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే..?
తెలంగాణలో గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఊరు, వాడ, పల్లె, పట్నం తేడా లేకుండా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరబాద్ లో పోలీసులు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొంత మంది పొకిరీలు మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు.
గతంలో వినాయకచవితి ఉత్సవాల సమయంలో కొంత మంది ఆగంతకులు.. అమ్మాయిల్ని వేధించిన ఘటన కూడా వార్తలలో నిలిచింది. దీంతో పోలీసులు మరోసారి మద్యంతాగి గొడవలు చేయకుండా కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా.. హైదరబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో.. సెప్టెంబర్ 17 ఉదయం 6 నుంచి, సెప్టెంబర్ 18 సాయంత్రం 6 వరకు మద్యం షాపులు బంద్ ఉంచాలని కూడా హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎక్కడైన అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. మరోవైపు ఆబ్కారీ అధికారులు సైతం.. మద్యం దుకాణాలు క్లోజ్ చేసి ఉంచాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
దేశంలో చాలా వరకు జరుగుతున్న క్రైమ్ లలో మద్యం మత్తులో.. ఉన్న వాళ్లు చేస్తున్నట్లు కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ముఖ్యమైన కొన్నిరోజుల్లో , శాంతి భద్రతలు తలెత్తినప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా మద్యం షాపులను బంద్ ఉంచాలని ఆదేశిస్తుంటారు.