Yadamma Raju: దేవుడు పంపిన బిడ్డ..కూతురుకు యాదమ్మరాజు ఎలాంటి పేరు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు

Mon, 30 Dec 2024-7:52 pm,

Yadamma Raju:  యాదమ్మ రాజు, స్టెల్లాది లవ్ మ్యారేజ్. రెండేళ్ల  క్రితం వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు.   

తాజాగా తమ గారాలపట్టి గురించి యాదమ్మ రాజు, స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.   

8 ఏళ్ల ప్రేమ ప్రయాణం, 2 ఏళ్ల భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మన కూతురు. మొన్నటి వరకు మేం కేవలం భార్యభర్తలం మాత్రం ఇప్పుడు తల్లిదండ్రులం అయ్యాం.   

మేము మొదట్నుంచి కూతురే పుట్టాలని అనుకున్నాం. ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు. మా పాప మా బంగారు తల్లి..ఇప్పుడు ఆమెనే మా సర్వస్వం అంటూ పోస్టు చేశారు.   

ఈ బిడ్డ మాకు దేవుడు ఇచ్చిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్ నేమ్ పెట్టాము అంటూ ఈ పోస్టులో చెప్పుకొచ్చారు.   

యాదమ్మ రాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మరాజు దంపతులకు  విషేస్ చెబుతున్నారు. 

అయితే ఈ ఫొటోల్లో తమ కూతురు ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link