ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, ఈ కారణం తెలుసుకోండి
PNB Latest Updates: ఎస్‌బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్‌బీ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Union Budget Effect on Prices: బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో..ఏవి తగ్గుతున్నాయో తెలుసా
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి నగదు డ్రా చేయడం వీలు కాదు. ఫిబ్రవరి 1 నుంచి పీఎన్‌బీ నిర్ణయం తీసుకున్న కొత్త రూల్ అమలులోకి రానుంది. ఏటీఎం(ATM Latest Updates) మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్ల నగదు భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు
నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల ద్వారా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు నిలిపివేస్తున్నట్లు పీఎన్‌బీ బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం కేంద్రాల నుంచి పీఎన్‌బీ ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసే వీలుండదు.
ఏటీఎం కేంద్రానికి వెళ్లిన తర్వాత కొన్ని ఏటీఎం కేంద్రాలో ఒక్కసారి కార్డ్ ఇన్‌సర్ట్ చేసి వెనక్కి తీసుకుంటే ఆ ఏటీఎంలను నాన్ ఈఎంవీ ఏటీఎంలు అని అంటారు.
Also Read: Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన PMAYపై Budget 2021లో గుడ్ న్యూస్
మీ ఏటీఎం కార్డును మెషీన్లో పెట్టి ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు అలాగే ఉంచాల్సిన ఏటీఎంలను ఈఎంవీ ఏటీఎం అంటారు. సాధారణంగా మన కార్డు మీద ఉన్న మాగ్నటిక్ స్ట్రిప్ మీద ఉన్న వివరాలను ఏటీఎం మెషీన్ రీడ్ చేసి డేటా చెక్ చేస్తుంది.
Also Read: SBI debit card లేకుండానే YONO App తో ATM లో మనీ విత్‌డ్రా