COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Easy Weight Loss Diet Plan In Telugu: చలికాలంలో ఏ పని చేయడమైన చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడం ఇంకా చాలా కష్టం. అయితే చాలామంది ఈ శీతాకాలంలోనే మిగతా కాలాలతో పోలిస్తే ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా శరీర బరువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకపోతే అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చలికాలంలో ఎక్కువగా ఆహారాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


ఊబకాయం సమస్యతో బాధపడేవారు చలికాలంలో వాకింగ్ తో పాటు డైటింగ్ పద్ధతులను అనుసరించి బరువు తగ్గడమే కాకుండా నిద్రపోతూ కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఈ సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తింటూ ఉంటారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని టీలను ప్రతిరోజు తాగితే నిద్రపోతూ కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే  శీతాకాలంలో సులభంగా బరువు తగ్గడానికి ప్రతిరోజు ఏయే టీలను తాగాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


గ్రీన్ టీ:
శీతాకాలంలో ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా నియంత్రిస్తుంది అంతేకాకుండా శరీరానికి వెచ్చదనం అందించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ గ్రీన్ టీని ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే, ముందు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


చమోమిలే టీ:
ఈ చమోమిలే టీలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తలనొప్పి నిద్రలేమి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. కాబట్టి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ టీ ని తప్పకుండా తాగాలి.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


డైట్ పాటించే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:
కొంతమంది బరువు తగ్గడానికి నామమాత్రంగా డైట్లను పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలపై ప్రభావం చూస్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గడానికి డైట్లను అనుసరిస్తున్న వారు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.


బరువు తగ్గాలనుకునేవారు ఈ ఫోజ్ లో పడుకోండి:
శరీర బరువును తగ్గించేందుకు పడుకునే భంగిమలు కూడా ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు కాళ్ళను చాచి వెనక భాగంలో పడుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter