7 members On 1 Bike: ఒక్క బైకుపై ఏడుగురి ప్రయాణం.. వీడియో వైరల్..
Viral Video of 7 members On 1 Bike: ఒక్క బైకుపై ఒక్కరు వెళ్తే అది ప్రయాణం అనుకోవచ్చు.. ఇద్దరు వెళ్తే అది అవసరం అనుకోవచ్చు.. ఇద్దరికి మించి ముగ్గురు వెళ్లే.. అది ట్రాఫిక్ రూల్స్ విరుద్ధం అయినప్పటికీ.. ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో వెళ్లి ఉండవచ్చు అని అనుకోవచ్చు.. కానీ ఒకే బైకుపై ఒకేసారి ఏకంగా ఏడుగురు వెళ్తే అది ఏమనుకోవాలో మీరే చెప్పండి...
Viral Video of 7 members On 1 Bike: ఏంటి బైకుపై ఏడుగురు వెళ్లిర్రా.. అది నిజమేనా ? అసలు అది సాధ్యమేనా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును నిజమే. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ రియల్ సీన్ చోటుచేసుకుంది. అంతా యువకులే.. ఇంకా చెప్పాలంటే అంతా 20 ఏళ్లలోపు పిల్లల్లానే కనిపిస్తున్నారు. జీవితం అంటే ఏంటో తెలియని పిల్ల చేష్టలు కదా.. అందుకే ఇలా తిన్నది అరగని పనిచేశారు. వీళ్ల దుస్సాహసంలో ఏ మాత్రం అటు ఇటు అయినా బైకుపై కూర్చున్న వారి ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోతాయి. ఈ యువకుల దుస్సాహాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను నిశితంగా పరిశీలించండి. ఒక్కసారి బైకుపై ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారో లెక్కపెట్టండి.. ఒక్కటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు.. యస్ ఏడుగురు ఉన్నారు. సాధారణంగా ఇలా ఒకే బైకుపై వీలైనంత ఎక్కువ మంది కూర్చుని, నిలబడి, లేదా జాతీయ జండాకు సెల్యూట్ చేస్తూ మిలిటరీ సైనికులు స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లోనో లేక గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనో సాహసాలు చేస్తుంటారు. అది ఎంతో సుశిక్షితులైన బైక్ రైడర్స్ సమక్షంలో నేర్చుకున్న స్టంట్స్. పైగా వాళ్లు ఆర్మీ వాళ్లు. శత్రువులను ఎలా మట్టి కరిపించాలో తెలిసిన వాళ్లకు అలాంటి స్టంట్స్ పెద్ద లెక్క కాకపోవచ్చు. మరి ఇక్కడ వీళ్లు చేస్తున్నది ఏమనుకోవచ్చు.. నిస్సందేహంగా ఇది దుస్సాహసమే అవుతుంది.
ఇది కూడా చదవండి : Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు
వీళ్ల చేతిలో బ్యాట్ పట్టుకుని ఉండటం చూస్తోంటే.. వీళ్లంతా ఎక్కడో క్రికెట్ మ్యాచ్ ఆడటానికైనా వెళ్లూ ఉండి ఉండాలి. లేదంటే క్రికెట్ మ్యాచ్ నుంచి తిరిగి వెళ్తూ ఉండాలి. ఏదేమైతేనే.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ నోటా ఈనోటా ఈ వైరల్ వీడియో పోలీసుల వరకు చేరింది. ఈ వీడియో చూసి నోరెళ్లబెట్టడం పోలీసుల వంతయ్యింది. అంతేకాదు.. మరొకరు ఈ పని చేయకుండా ఉండటం కోసం ఆ బైకు నెంబర్ గుర్తించిన పోలీసులు.. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఆ బైకు యజమానికి రూ. 16 వేలు జరిమానా విధిస్తూ చలాన్ నోటీసులు పంపించారు. అంటే యువకులు చేసిన తిన్నది అరగని పనికి.. తగిన మూల్యం చెల్లించుకున్నారు అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియో చూసిన నెటిజెన్స్.
ఇది కూడా చదవండి : Too Many Snakes in Open Well: బావి నిండి భయంకరమైన నాగుపాములు, రక్త పింజర్లు.. ఎంత తెలివిగా పట్టాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK