9 Kg King Cobra Viral Video:పాముకాటు ప్రమాదం కలిగించేదని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలామంది వాటిని పట్టుకొని సాహసాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి పాము కాటుకు గురైతే.. అది జీవితాంతం అనారోగ్య సమస్యలకు కురిచేయవచ్చు. అంతేకాకుండా తీవ్ర విషయం కలిగిన ఇంకోబ్రాలు కాటేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు పాములను పట్టుకోవడానికి సంబంధించిన వీడియోలే అధికంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు ఓ పాము కు సంబంధించిన వీడియో అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ వీడియోను గమనిస్తే.. ఇద్దరు స్నేక్ క్యాచర్స్ ఓ 9 కేజీలు కలిగిన ప్రమాదకరమైన నల్లని కింగ్ కోబ్రా ను పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో జరిగిన సన్నివేశాలు అందర్నీ భయాందోళన కలిగించవచ్చు. ఈ వీడియోలో చూస్తే ఓ స్నేక్ క్యాచర్ 10 అడుగులు కలిగిన నల్లని 9 కేజీలు గల పాము తోకను పట్టుకొని బయటికి లాగుతాడు. దీంతో పాము తీవ్ర ఆగ్రహానికి గురై అతన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి దాని కాటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.



ఇంతలోనే ఓ లేడీ స్నేక్ క్యాచర్ పాముని ఆగ్రహానికి గురిచేస్తుంది. ఆ పాము ఆగ్రహానికి గురై ఆమెను కాటేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇలా 40 నిమిషాల పాటు పామును పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి ఆ తొమ్మిది కేజీల గల పాముని పట్టుకుంటారు. పట్టుకొని దానిని అడవిలోని సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదిలేస్తారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నేటిజెన్లు  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వీడియోను కింగ్ కోబ్రా హంటర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. దాదాపు ఈ వీడియోను ఇప్పటికీ 5 వేలకు పైగానే మంది వీక్షించారు. అంతేకాకుండా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు అయితే ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టాలని కామెంట్లలో పేర్కొన్నారు.