Peacock video viral: ఆ ఇంటికి అందమైన అతిధి అనుకోకుండా వచ్చివాలింది. కాస్సేపు బాల్కనీలో సందడి చేసింది. అటూ ఇటూ చూసింది. ఏమన్పించిందో..ఏమనుకుందో..అలానే ఎదురుగా ఉన్న మరో ఇంటికి తరలింది. ఇంతకీ ఆ అందమైన అతిధి ఎవరు,  ఎక్కడ జరిగింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంటికి వచ్చిన అందమైన అతిధి గురించి ప్రపంచానికి చాటిచెప్పినందుకు..ఆశ్చర్యంగా ఉందా.నిజమే. నిజంగా అందమైన అతిధి. అరుదైన రాక అది. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ సినిమా నుంచి దేఖా ఏక్ ఖ్వాబ్‌తో యే సిల్సిలే హుయే...అంటూ మరింతగా యాప్ట్ అయ్యే పాటతో ఆ అందమైన అతిధి రాక గురించి ఆ ఇంటి యజమాని ఎంత అందంగా అందరికీ చెప్పాడో..అందమైన అతిధి అరుదైన రాకకు అందమైన పాటను జోడించి అందించిన ఇన్‌స్టా రీల్ ఇది.


safarnamabynidhiపేరుతో ఉన్న బ్లాగర్ ఈ వీడియోనూ పోస్ట్ చేశాడు. చేసిన కాస్సేపటికే వైరల్ కాసాగింది. ఢిల్లీ లాంటి నగరంలో అరుదైన దృశ్యమిది. అందమైన నెమలి నా ఇంటికి అతిధిగా రాక. ఓ దశాబ్దంగా చూస్తున్నా ఇలా..నిజంగానే నెమలి ఎంత అందమైందో..అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.


మీటరుకు పైగా పొడవైన నెమలి పింఛాల తోకతో...మిరుమిట్లు గొలిపే అందమైన నెమలి ఢిల్లీ వికాస్ పురి ప్రాంతంలోని ఓ ఇంటి బాల్కనీలో వాలింది. అటూ ఇటూ సందడి చేసి..రైలింగ్ ఎక్కింది. ఏమనుకుందో..మరో ఇంటికి వెళ్లాలన్పించిందో మరి..అటూ ఇటూ చూసి..ఎదురుగా ఉన్న మరో ఇంటి బాల్కనీలోకి వెళ్లి వాలింది. ఢిల్లీ వంటి నగరంలో నెమలి అంత స్వేచ్ఛగా తిరగడం చాలా అరుదైన విషయమే. ఇదంతా షూట్ చేసిన ఆ ఇంటి యజమాని అందమైన పాటను బ్యాక్‌డ్రాప్గా పెట్టి ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్ చేశాడు. అదే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.



ఈ దృశ్యాన్ని గత పదేళ్లుగా చూస్తున్నాడట ఆ ఇంటి యజమాని. ప్రతి ఏటా వేసవిలో మే చివరిలో నెమలి వచ్చి అక్టోబర్ వరకూ ఇరుగుపొరుగు ఇళ్లలో తిరుగుతుందట. ఈ వీడియా ఇప్పటికే 5.51 మిలియన్ల మంది వీక్షించగా..525 వేల లైక్స్ వచ్చిపడ్డాయి. 


ఇండియాలో నెమలి మేటింగ్ సీజన్ మే నుంచి ప్రారంభమై..వర్షాకాలం వరకూ కొనసాగుతుంది. మగ నెమలిని ఆకర్షించేందుకు నెమలి పురి విప్పి ఆనందంగా నృత్యం చేస్తుంటుంది. 


Also read: Chimpanzee Brothers: చాలా రోజుల తర్వాత కలుసుకున్న రెండు చింపాంజీలు.. ఏం చేశాయో చూడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook