Japan: జపాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందిన మరియు ఎన్నో అటుపోటులను ఎదుర్కొన్న నిలబడిన దేశం. టెక్నాలజీని అందిపుచ్చుకుని..తయారీ రంగంలో తనదైన ముద్రవేసింది. జపాన్​లో వాషింగ్​ మెషీన్లు(washing machines) లేని ఇల్లు ఉండదంటే నమ్మండి. అక్కడ ప్రతీ ఇంటిలోనూ ఒకటి ఉంటుంది. అంతేకాదు అక్కడ వీధుల్లోనూ కాయిన్​ లాండ్రీ(Coin laundry)లు ఉంటాయి. చాలామంది తమ బట్టలు లాండ్రీలో వేసుకుని డబ్బులు ఇవ్వకుండా కూడా వెళ్లిపోతారు. అయితే జపాన్(Japan)​లో ఓ ఫాంటీ దొంగ(panty thief) చేసిన పని దేశంలో చర్చనీయాంశమైంది. అసలు అతను దొంగతనం చేసింది ఏంటో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే.. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జపాన్​లోని బెప్పు (Beppu) నగరంలో ఆ ఫాంటీ దొంగ మాత్రం లాండ్రీ(laundry)లో వేసిన అండర్​వేర్​ల(Underwear)ను దొంగతనం చేస్తున్నాడట. అయ్యో పాపం కనీసం అండర్​వేర్​లు కూడా కొనలేని స్థితిలో ఉన్నాడు అనుకోకండి. అతని వృత్తే  మహిళల లో దుస్తులను(Inner wears) కొట్టేయడం అంట. ఇంతకీ అతని పేరు ఏంటంటే.. టెట్సువో ఉరతా (Tetsuo Urata). వయస్సు 56 ఏళ్లు. అయితే అతను దొంగతనం చేసిన ముష్టి అండర్​వేర్​లకే అంత పెద్ద చర్చ ఎందుకు అనుకోకండి. అతను కొట్టేసిన మహిళల అండర్​వేర్​ల సంఖ్య ఏకంగా 730. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడిందట. అన్నీ కూడా వాడేసిన లో దుస్తులే(Used Underwear’s) కావడం విశేషం.


Also Read: Superstition: వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు..ఎక్కడో తెలుసా?


దొంగ దొరికాడు...పోలీసులు అవాక్కయ్యారు..


ఇంతకీ ఆ అండర్​వేర్​ దొంగ(Underwear thief) ఎలా దొరికాడంటే. ఓ 21 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆరు జతల లో దుస్తులు( 6 pairs of Inner wears) ఇటీవల మిస్​ అయ్యాయంటా. లాండ్రీలో వేసిన లో దుస్తులు కనిపించకపోవడంతో ఏకంగా పోలీసులకే ఫిర్యాదు(Complaint) చేసింది ఆమె. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(police) సీసీ టీవీ కెమెరా(CCTV Camera) ఫుటేజీని పరిశీలించి దొంగ టెట్సువో ఉరతా (Tetsuo Urata) అని తేల్చారు. ఇంకేముంది వెంటనే వెళ్లి ఆగస్టు 24న అతని ఇంటిపై దాడి చేశారు పోలీసులు. అయితే ఏదో ఒకటి, రెండు లో దుస్తులు దొరుకుతాయనుకుంటే ఏకంగా 730 వాడేసిన అండర్​వేర్​లు దొరకడంతో పోలీసులు అవాక్కయ్యారంట.


అయితే పోలీసులు మాత్రం అతన్ని పలు కోణాల్లో విచారిస్తున్నారంట. అసలు ఇలాంటి దొంగతనాలు చేయడం ఏంటని పోలీసులే షాక్​ అయ్యారు. పోలీసులు మాట్లాడుతూ.. ఏళ్లుగా ఈ ఉరతా ఇదే పనిచేస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ అతను అలా వాడేసిన వస్తువులు(Used things) దొంగతనం ఎందుకు చేశాడో తెలియదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఓ మహిళ సోషల్​ మీడియా(Social media)లో పోస్టు చేయడంతో వైరల్​గా మారింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook