Viral Video: చిన్న పిల్లలు ఇంట్లో చేసే చిలిపి పనులను చూసి.. ఇంట్లో వాళ్లంతా తెగ ముగిసిపోతుంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో.. తమ పిల్లలు చేసే చిలిపి పనులను కొంత మంది వీడియోగా తీసి ఇంటర్నెట్​లో పెడుతుంటారు. అలాంటి వీడియోలు చాలా వరకు వైరల్​ అవుతుంటాయి కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటిదే తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో హల్​చల్​ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


ఇలా కూడా నిచ్చెన దిగొచ్చా?


సాధారణంగా ఊర్లల్లో చెక్కతో చేసిన నిచ్చెనలు కనిపిస్తుంటాయి. ఇళ్లు ఎక్కేందుకు దిగేందుకు వీటినే ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే అలాంటిదే ఓ ఇంటికి ఉన్న చెక్కనిచ్చెనను ఎక్కిన ఓ బుడతడు.. దిగడంలో మాత్రం సరికొత్త విధానాన్ని అనుసరించాడు.


నిజానికి ఎవరైనా అలాంటి నిచ్చేన ద్వారా కిందకు దిగాలంటే.. ఒక్కో మెట్టుపై జాగ్రత్తగా కాలుపెట్టి దిగుతారు. ఎందుకంటే అంత ఎత్తులో కాలు జారితే అంతే సంగతులు అని.


కానీ ఇక్కడ ఆ బుడ్డోడు మాత్రం కాళ్లను మెట్లపై పెట్టకుండా.. కిందకు జారుకుంటూ వచ్చాడు. అయితే తన వేగాన్ని అదుపు చేసేందుకు చేతుల ద్వారా మెట్లను పట్టుకుంటూ.. కిందకు దిగాడు.


15కు పైగా మెట్లున్న ఆ చెక్కనిచ్చెనను ఆ బుడ్డోడు.. క్షణాల్లో దిగేశాడు. అయితే ఆ వీడియో చూస్తున్నంత సేపు ఆ చిన్నారి ఎక్కడ కింద పడతాడోనన్న భయం మాత్రం కలుగుతుంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అ బుడ్డోడు కనీస భయం కూడా లేకుండా.. సురక్షితంగా కిందకు దిగి పక్కకు వెళ్లడం ఈ విశేషం.


ఆ బుడ్డొడి నిచ్చేన దిగే విధానాన్ని ఆ ఇంట్లో వాళ్లే వీడియో తీయడం గమనార్హం. అయితే అది ఎక్కడ జరిగింది అనేదానిపై మాత్రం ఆధారాలు లభించలేదు.


ఇంటర్నెట్​లో చర్చ ఇలా..


ఈ వీడియోను ghantaa అనే ఇన్​స్టా పేజీ చేసింది. ఈ పోస్ట్​కు.. ఆ చిన్న పిల్లాడిని ఒలింపిక్సక్​కు రెడీ చేయ్యండి అంటూ.. ఫన్నీ క్యాప్షన్​ను జోడించారు.



ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా కుర్రాడి సాహసంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆ చిన్నోడిని మెచ్చుకుంటూ.. గ్రెట్​, చాలా బాగా చేశాడు అని కామెంట్​ చేస్తున్నారు.


ఇండియాలో రోబోల అవసరం లేదు, ఫాస్ట్​ ఫార్వర్డ్​ (నిచ్చెన దిగే వేగాన్ని ఉద్దేశిస్తూ) అంటూ మరికొంత మంది స్పందిస్తున్నారు.


అయితే కొంత మంది మాత్రం ఆ చిన్న కుర్రాడు కిందకు దిగడం ప్రమాదకరమంటూ స్పందిస్తున్నారు. పిల్లల విషయంలో తల్లిడండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోను మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు.


Also read: Viral News: బడిలో విద్యార్థినిని కౌగిలించుకున్న హెడ్‌మాస్టర్ వీడియో వైరల్, పోక్సో కేసు నమోదు


Also read: Ashwin Video: పుష్పరాజ్ ను వదలని క్రికెటర్లు...'శ్రీవల్లి' సిగ్నేచర్ స్టెప్పును తన స్టైల్లో అదరగొట్టిన అశ్విన్, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.