Deadly Dangerous Cobra Catching: ఈ భూ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో 'కింగ్ కోబ్రా' ఒకటి. కింగ్ కోబ్రా కాటు వేస్తే.. మనిషి బతకడం చాలా కష్టం. కింగ్ కోబ్రా విషం అత్యంత విషపూరితమైనది కాదు. అయితే అది కాటేసే సమయంలో ఎక్కువ విషాన్ని చిమ్ముతుంది. అందుకే కింగ్ కోబ్రా కాటుకు బలమైన ఏనుగు కూడా నిమిషాల వ్యవధిలో చనిపోతుంది. అందుకే కింగ్ కోబ్రా అంటే చాలామంది హడలిపోతారు. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్స్ మాత్రమే కింగ్ కోబ్రా పట్టేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రా కంటే అల్బినో కోబ్రా మరింత ప్రమాదకరం. తెల్లగా ఉండే అల్బినో కోబ్రా కూడా కింగ్ కోబ్రా మాదిరిగానే విషాన్ని చిమ్ముతుంది. అయితే ఈ పాము వైట్ కలర్‌లో చాలా భయానకరంగా ఉంటుంది. అందుకే కొందరు స్నేక్ క్యాచర్స్ కూడా అల్బినో కోబ్రాను పట్టేందుకు కాస్త ఆలోచిస్తారు. అయితే ఓ స్నేక్ క్యాచర్ మాత్రం ఎలాంటి భయం లేకుండా చాలా సునాయాసంగా పట్టేశాడు. కాటేయడానికి మీదికి దూసుకొచ్చినా.. చాలా ఈజీగా పట్టి సంచిలో బంధించాడు. 


రష్యా స్నేక్ క్యాచర్స్ ఇద్దరు అక్కడి పొలాల్లో పాములను పడుతున్నారు. ఈ క్రమంలో పొలం గట్టుపై ఉన్న పుట్టలో రెండు పాములు ఉన్నట్టు గుర్తించారు. పార, గునపం సాయంతో పుట్టాను తొవ్వగా.. ముందుగా బఫెలో కింగ్ కోబ్రా బయటికి వస్తుంది. దాన్ని పుట్టలోంచి బయటికి తీశాడు. ఆపై ఆ పుట్టను మరింత తవ్వగా అల్బినో కోబ్రా కనిపిస్తుంది. స్టిక్ సాయంతో దాన్ని బయటికి తీసి.. తోక పట్టుకుని గుంజాడు. దాంతో అది బుసలు కొడుతూ కరవడానికి మీదికి దూసుకొచ్చింది. అయినా సరే ఏమాత్రం భయపడని స్నేక్ క్యాచర్ దాని పట్టుకుని సంచిలో వేశాడు. 



అల్బినో కోబ్రాకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో 2 సంవత్సరాల క్రితం నాటిదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 22,046,462 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. రేర్ అల్బినో కోబ్రాను చూసి అందరూ షాక్ అవుతున్నారు.  


Also Read: Ranji Trophy 2023 Final: చెలరేగిన ఉనద్కత్, చేతన్ సకారియా.. రంజీ ట్రోఫీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన బెంగాల్!  


Also Read: Pakistan Fuel Prices Hike: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌ ధర రూ.272! లబోదిబోమంటున్న ప్రజలు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి