Pakistan Govt Hikes Petrol Price by 22.20 Rupees Per Litre: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్దిక సంక్షోభంను ఎదుర్కొంటోంది. దాయాది దేశంలో నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాలు, ఆయిల్, పిండి, ఉల్లిపాయ, చికెన్ నుంచి గ్యాస్ వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడంతో ఆగమాగమవుతున్న సామాన్య ప్రజలకు పాక్ ప్రభుత్వం మరో భారీ షాకిచ్చింది. తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచింది. దాంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 272కు చేరుకుంది.
బుధవారం రాత్రి పెట్రోల్ ధరను పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 22.20, హైస్పీడ్ డీజిల్‌పై రూ. 17.20, కిరోసిన్‌పై రూ. 12.90 మేర పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పాక్ ప్రభుత్వం పెంచింది. మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది గంటల్లోనే చమురు ధరలు పెరగడం గమనార్హం. కొత్త ధరలు గురువారం (ఫిబ్రవరి 16) నుంచి అమల్లోకి వస్తాయని పాక్ ప్రభుత్వం పేర్కొంది.
రూ. 22.20 పెరిగిన తర్వాత లీటరు పెట్రోలు ధర పాకిస్తాన్‌లో రూ. 272కు చేరింది. అదే విదాహంగా రూ. 17.20 పెంపు తర్వాత లీటరు హైస్పీడ్ డీజిల్ రూ. 280 కాగా.. రూ. 12.90 పెంపు తర్వాత లీటరు కిరోసిన్ ధర రూ. 202.73కి చేరింది. మరోవైపు తేలికపాటి డీజిల్ 9.68 పెరిగిన తర్వాత లీటరు రూ. 196.68గా ఉంది. తాజాగా పెరిగిన ఇంధన ధరలతో పాక్ ప్రజలు లబోదిబోమంటున్నారు. తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్‌లో ప్రధాన నగరమైన కరాచీలో దుకాణ దారులు పాల ధరలను లీటరు రూ.190 నుంచి రూ. 210కి పెంచారు. లూజ్ మిల్క్, పాకెట్ పాలు అన్నింటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటాయి. ఇక బ్రాయిలర్ చికెన్ ధర కిలోపై రూ. 30-40 పెరగడంతో.. రూ. 480-500కి చేరుకుంది. పాకిస్తాన్ అనేక దశాబ్దాల తర్వాత గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని (27%) ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Aslo Read: Amazon Air: హైదరాబాద్ నుంచి అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.