COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bald Groom Beaten Up Viral Video: బట్ట తల కారణంగా పెళ్లి కావడం లేదని మనం వీధుల్లోని అమ్మలక్కల మచ్చట్లు చాలా సార్లు విని ఉంటాం. అంతేకాకుండా పెళ్లికానివారు బట్టతలను దాచుకునేందుకు చాలా మంది హెయిర్‌ బౌడింగ్‌, విగ్‌లను వినియోగిస్తారు. అయితే ఇటీవలే ఓ వింత సంఘటన జరిగింది. పెళ్లి చేసుకునేందుకు బట్టతల కవర్‌ చేసుకుని వచ్చిన వరుడుని వధువు బంధులు చెంపలు చెల్లుమనిపించారు. ఆ తర్వాత ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ఈ ఘటన  బీహార్‌ (Bihar)లోని దోభి ప్రాంతంలో జరిగింది. చివరికి పెళ్లి కొడుకుని వధువు బంధువులు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.


గయా ప్రాంతంలో ఇక్బాల్ నగర్‌కి వరుడు తనకు గత కొన్ని సంవత్సరాల నుంచి బట్టతల సమస్యలతో బాధపడుతున్నాడని, అంతేకాకుండా ఎవరు పెళ్లి చేసుకోవడం లేదని తన బట్టతలపై విగ్‌ను పెట్టించుకున్నాడు. అయితే ఇంతలోనే ఆతని ఓ పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో ఆ వ్యక్తి పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకునేందుకు వధువు ఇంటికి వెళ్లిన వరుడికి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆ పెళ్లి కొడుకుది సాధరణ జుట్టు కాదని విగ్‌ అని అందరికీ తెలిసింది. దీంతో ఆ వరుడు వధువు కుటుంబ సభ్యులను మోసం చేశాడని అతన్ని ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు.




అంతేకాకుండా వధువు బంధువులకు ఇంకో నిజయం తెలిసింది. ఇప్పటికీ ఆ వరుడికి వేరే అమ్మాయితో పెళ్లైందని, పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వారు మరింత ఆగ్రహానికి గురై ఆ వరుడిని వధువు బంధులు చావగొట్టారు. ఆ తర్వాత బీహార్‌ గయాలో పోలీసులకు అతన్ని అప్పగించారు. దీంతో పోలీసులు వరుడిపై వివిధ సెక్షన్స్‌లో కేసులు నమోదు చేశారు. ఈ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నారు. వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు.


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం


ఇంతక ముందే వరుడిని గమనించారు:
బట్టతలను దాచిపెట్టేందు ఆ పెళ్లి కొడుకు బట్టతలపై విగ్‌ పెట్టుకుని వచ్చాడు. అంతేకాకుండా వధువు తరుఫున ఉన్న అందరినీ మోసం చేసేందుకు స్కెచ్‌ వేశాడు. కానీ ఈ స్కెట్‌ లాస్ట్‌లో అందరికీ తెలిసింది. అయితే ఆ వరుడికి ఇంతక ముందే బట్టతల ఉందని పెళ్లికి సంబంధించిన ఓ కుటుంబ సభ్యుడు గమనించారు. దీంతో వరుడిని పెళ్లికి నాలుగు రోజుల ముందే బార్బర్‌ని పిలిపించి షేవింగ్, జుట్టు కత్తిరించుకోమని కోరారు. దీంతో వరుడు జుట్టు కరించేందుకు నిరాకరించడంతో అనుమానం వచ్చి పెళ్లిలో తలపై ఉన్న విబ్‌ను పికి చూశారు. ఆ విగ్‌ బయటకు ఊడి రావడంతో వరుడి అసలు నిజం బయట పడింది. 


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి