Bear Video: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో కాస్త భిన్నమైంది. రోడ్డుపై వచ్చిపడిన ఓ ఎలుగుబంటికి ఉన్న ట్రాఫిక్ స్పృహను చెప్పకనే చెబుతోంది ఈ వీడియో. ఎలుగుబంటికున్న ట్రాఫిక్ స్పృహ..సాధారణ జనానికి ఉండటం లేదు కదా మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సృష్టిలో ఉన్న జీవుల్లో మనిషి చాలా తెలివైనవాడంటారు. మంచికి,చెడుకు తేడా మనిషికే తెలుస్తందంటారు. కానీ ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఓ ఎలుగుబంటికి ట్రాఫిక్ విషయంలో ఉన్న అవగాహనకు అద్దం పడుతోంది ఈ వీడియో. ఎలుగుబంటిటి ట్రాఫిక్ అవగాహనేంటంటారా..ఈ వీడియో చూడండి మరి.


జంతువులకు నిజంగానే సిక్స్త్ సెన్స్ ఉంటుందంటారు. అదే విధంగా జంతువులు తెలివైనవి కూడా. తెలివితేటల విషయంలో జంతువులు సమయం వచ్చినప్పుడల్లా చూపించుకుంటాయి. అటువంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయి. అందులో ఒకటి కాదు ఇది..చాలా భిన్నమైంది. ఖాళీగా ఉన్న రోడ్డుపై వచ్చేసిన ఓ  ఎలుగుబంటికి ట్రాఫిక్ రూల్స్ ఏంటో తెలిసిపోయాయి. అందుకే అలా వస్తున్నప్పుడు దారిలో ఆ ఎలుగుబంటికి పడిపోయిన ఓ ట్రాఫిక్ కోన్ ఎదురైంది. అది చూసి ఏమన్పించిందో మరి..కాస్సేపు ఆగిపోయింది. తన నోటితో ఆ ట్రాఫిక్ కోన్‌ను నిటారుగా నిలబెట్టి అప్పుడు ముందుకెళ్లింది.


ఈ వీడియో ఎలుగుబంటి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా లైక్స్ వచ్చి పడుతున్నాయి. రీట్వీట్స్ అవుతోంది ఈ వీడియో. పెద్దఎత్తున కామెంట్లు కూడా వస్తున్నాయి. కేవలం ఎలుగుబంటే కానీ..గుడ్ సిటిజన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ కోన్ అలా నిలబడి ఉండాలని ఎలుగుబంటికి ఎలా తెలిసింది, మనుష్యులకు తెలియని విషయం దానికర్ధమైందంటూ కామెంట్లు అందుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ పని చేయాలని ఆ ఎలుగుబంటికి ఎలా అన్పించిందని ప్రశ్నిస్తున్నారు. చాలామంది మనుష్యుల కంటే ఇది బెటర్ అని అంటున్నారు. ఆ ట్రాఫిక్ కోన్ అలా పడిపోయుండటాన్ని ఆ ఎలుగుబంటి సహించలేకపోయింది. అందుకే నిటారుగా నిలబెట్టి మరీ ముందుకెళ్లింది.


అమెరికా అలాస్కాలోని దేనాలి నేషనల్ పార్క్‌లో ఈ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్క్‌లో ఎలుగుబంట్లు, తోడేళ్లు ఇలా చాలా రకాల జంతువులే తిరుగుతుంటాయి.


Also read: Video: వావ్.. ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా... మీరూ ఓ లుక్కేయండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి