Bengaluru womans head gets stuck in ksrtc bus window: కొన్నిసార్లు బస్సు ప్రయాణాలలో అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. మనం తరచుగా బస్సులలో ఎక్కువగా ప్రయాణిస్తుంటాం. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా బస్సులకు సంబంధించిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల టికెట్ల కోసం మహిళలు కండక్టర్ తో గొడవలుపడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల మహిళలు సీటు కోసం  కొట్టుకున్న ఘటనలు వైరల్ గా మారాయి.  జుట్లు పట్టుకుని, చీరలు చింపుకుంటు కొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. తమ భార్యల సీట్ల కోసం భర్తలు సైతం రంగంలోకి దిగికొట్టుకున్నారు. ఇక మరోవైపు.. బస్సులలో కొందరు టికెట్ కు సరిపడా టికెట్ లు ఇవ్వమని అడిగినందుకు కండక్టర్ తో కూడా గొడవలు పడ్డారు. అంతే కాకుండా.. కొన్నిసార్లు బస్సులలో అనుకొని ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటకలో ఒక బస్సులో అనుకొని ఘటన జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఒక మహిళ బెంగళూరులోని కేఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కింది. బస్సు చివరన వెళ్లికూర్చుంది. ఆమెకు ఏమనుకుందో ఏంటో కానీ.. కిటీకి నుంచి తలను బైటకు తీసి ఉమ్మివేసింది. ఆతర్వాత తలను లోపలికి తీసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఎంతగా ట్రై చేసిన మాత్రం తల మాత్రం లోపలికి రాలేదు. దీంతో మహిళ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారిని అలర్ట్ చేసింది.  కాపాడాలంటూ వేడుకుంది. అక్కడున్న వారు, డ్రైవర్ , కండక్టర్ లు కూడా అక్కడకు వచ్చి, తలను లోపలికి జరిపేందుకు ప్రయత్నించారు.


కానీ చాలా సేపటికి వరకు కూడా కుదరలేదు. మహిళ బాధతో విలవిల్లాడిపోయింది. డ్రైవర్లు, కండక్టర్ లు దాదాపుగా  గంటసేపు శ్రమించారు. చివరకు ఎలాగోలా ఆమె తలను లోపలి వైపుకు వెళ్లేలాతీశారు. దాదాపు గంటసేపు కూడా మహిళ ఎంతో నరకం అనుభవించినట్లు తెలుస్తోంది. ఎందుకు తలబైటకు పెట్టానా.. అంటూ తెగ ఇబ్బంది పడిపోయింది.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


మహిళ బాధను చూసి అక్కడున్న వారు కూడా చలించిపోయారు. ఆమెను బైటకు లాగటానికి తమవంతుగా కూడా ఎంతో ప్రయత్నించారు. చివరకు డ్రైవర్ లు, కండక్టర్ లున కల్గజేసుకుని, అద్దంను పక్కకు తప్పించి మహిళన సెఫ్టీగా తల బైటకు తీశారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter