Arrest Pigs: ఊర పందులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు కమిషనర్ లేఖ.. పందులు చేసిన నేరం ?
Arrest Pigs: రాజస్థాన్‌లోని భిల్వారా మునిసిపల్ కమిషనర్ దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్శి సిద్ధూకి ఓ లేఖ రాశారు. భిల్వారా మునిసిపాలిటీ పరిధిలోని 70 వార్డులలో వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఆయా వార్డులలోని పౌరుల స్వేచ్చా జీవితానికి అసౌకర్యంగా మారాయని.. వాటిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల సహాయం కావాలని అభ్యర్థిస్తున్నట్టుగా మునిసిపల్ కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Arrest Pigs: కొన్నిసార్లు కొంతమంది అధికారులు చేసే పనులు స్పృహలో ఉండి చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు కానీ వారు చేసే తప్పిదం వారిని వార్తల్లో వ్యక్తులుగా నిలబెట్టడమే కాదు.. డ్యామేజీ కంట్రోల్ కోసం ఏం చేసినా అది వారిని మరింత అబాసుపాలు చేయడమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. మ్యాటర్ అర్థం కావడం లేదా ? అయితే, ఇదిగో ఈ న్యూస్ చూడండి.. ఇప్పుడు చెప్పిన ఉదాహరణకు సరిగ్గా సూట్ అవుతుంది.
రాజస్థాన్‌లోని భిల్వారా మునిసిపల్ కమిషనర్ దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్శి సిద్ధూకి ఓ లేఖ రాశారు. భిల్వారా మునిసిపాలిటీ పరిధిలోని 70 వార్డులలో వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఆయా వార్డులలోని పౌరుల స్వేచ్చా జీవితానికి అసౌకర్యంగా మారాయని.. వాటిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల సహాయం కావాలని అభ్యర్థిస్తున్నట్టుగా మునిసిపల్ కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మునిసిపల్ కమిషనర్ రాసిన లేఖ చూసిన భిల్వారా జిల్లా ఎస్పీ ఆదర్శ్ సిద్ధూ పడిపడి నవ్వడం మొదలుపెట్టారు. ఎస్పీ మాత్రమే కాదు.. పోలీసులు మొత్తం ఆ లేఖ చదువుకుని నవ్వాపుకోలేకపోయారు. మునిసిపల్ కమిషనర్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తన తప్పిదం ఏంటో తెలుసుకున్న మునిసిపల్ కమిషనర్.. ఆ మరుసటి నాడైన ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీ ఆదర్శ్ సిద్ధూకి మరో లేఖ రాశారు. కానీ అప్పటికే మొదటి రోజు రాసిన లేఖ వైరల్ అవడంతో జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
రెండో రోజు రాసిన లేఖలో ఏం పేర్కొన్నారంటే.. తమ ఉద్దేశం పందులను పోలీసులు అరెస్ట్ చేయమని చెప్పడం కాదని.. పందులను పట్టుకునే కాంట్రాక్టర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నందున వారి మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాల్సిందిగా కోరమని చెప్పడమే తమ ఉద్దేశం అని మునిసిపల్ కమిషనర్ రెండో రోజు రాసిన లేఖలో రాసుకొచ్చారు. కొత్త కాంట్రాక్టర్ బయటి వ్యక్తి కాగా గతంలో పనిచేసిన పాత కాంట్రాక్టర్ స్థానికుడు అవడంతో కొత్త కాంట్రాక్టర్ పాత కాంట్రాక్టర్ ని అనుమనితించడం లేదని.. ఈ క్రమంలోనే ఒకవేళ వారి మధ్య గొడవ జరిగితే లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా చూడాల్సిందిగా కోరడం కోసమే తాము ఈ లేఖ రాశాం అని చెప్పుకొచ్చారు. మొదటి లేఖను కవర్ చేయడానికే రెండో రోజు మరో లేఖ రాశారని స్పష్టంగా అర్థమైంది. దీంతో భిల్వారా మునిసిపల్ కమిషనర్ ఇమేజ్ ఇంకాస్త డ్యామేజ్ అయింది.
ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా
ఇది కూడా చదవండి : Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్
ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook