Bihar Latest Snake Video: సాధారణంగా పాములను చూస్తే చాలామందికి భయం వేయడం సహజం. అందులోనూ కింగ్‌ కోబ్రా ఇతర విషపూరిత పాములను చూస్తే ఆమడ దూరం పారిపోతారు.  కొన్ని పాములను పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్లు సైతం నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ వైరల్‌ వీడియో చూస్తే  షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది..? అనే వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో ఓ వ్యక్తి పాము మెడలో వేసుకొని వేసుకొని ఆస్పత్రికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూసిన జనాలు భయంతో గగ్గోల పెట్టసాగారు. ఈ ఘటన బీహార్‌లోని  భగల్పూర్‌లో చోటుచేసుకుంది. ప్రకాశ్‌ అనే వ్యక్తిని రక్త పింజర అనే పాము కాటువేయడంలో పామును మెడలో వేసుకొని ఆస్పుత్రికి వస్తాడు. వ్యక్తి పాము నోటిని చేతితో గట్టిగా పట్టుకొని హాస్పిటల్‌కి వెళ్ళగా అతడిని చూసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయపడిపోయినట్లు కనిపిస్తుంది. పామును పట్టుకొని నేల మీద పడి తనకు వెంటనే చికిత్స చేయాలని వైద్యులను వేడుకుంటాడు. వైద్యలు, సిబ్బంది ఆ పామును  ఓ సంచీలో బంధించి వ్యక్తికి చికిత్స అందించారని సమాచారం. ఈ వీడియోను ఎక్స్‌ వేదికగా తెలుగు స్క్రైబ్‌ పోస్ట చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలు  ఇదెక్కడి మాస్ రా మావా అని కామెంట్స్‌ చేశారు. 


 


 



 


 


రక్త పింజర కాటు వేస్తే ఏం జరుగుతుంది?


రక్త పింజర లేదా రసెల్‌స్ వైపర్ అని పిలుస్తారు. ఇది ఎంతో విషపూరిమైన పాము. దీని కాటు చాలా ప్రమాదకరం. ఈ పాము విషం చాలా బలంగా ఉండి, రక్తం గడ్డకట్టడం, అవయవాల పనిచేయకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పాము కాటు వేసిన త్వరాత శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మొదట పాము కాటు వేసిన తరువాత రక్త కారుతుంది. అలాగే కాటు చోట వాపు ఏర్పుడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాము విషం శరీరంలో వ్యాపించడం వల్ల తల తిరగడం, కళ్ళు మబ్బుగా కనిపించడం వంటి సమస్యలు వస్తాయి. విషం వల్ల  కొంతమందిలో  మైకం వచ్చి, వాంతులు అవుతాయి. ఈ విషం మూత్రపిండాలను ప్రభావితం చేయడం వల్ల మూత్రం ఎర్రగా రావచ్చు.


రక్త పింజర కాటు వేస్తే ఏం చేయాలి:


రసెల్‌స్ వైపర్ కాటు వేసిన వెంటనే ఆస‌ప్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది.  కాటు వేసిన చోట ఏదైనా బిగించి కట్టడం వల్ల విషం శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి అలా చేయకూడదు. భయపడి పరుగులు తీయడం వల్ల గుండె స్పందన వేగంగా పెరిగి, విషం శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. నాటు వైద్యం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది.


ఇది కూడా చదవండి: Huge Snake Viral Video: బోరుబావు లాంటి గోతులు తీసే పాములను చూశారా? ఈ వీడియో చూస్తే కంగు తింటారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter