Viral Video: జంతువులు తమ కన్నా పెద్ద జంతువులను చూస్తే బయపడపటం సర్వ సాధారణం. పిల్లిని చూస్తే.. ఎలుక బయపటం.. అలానే సింహాన్ని చూస్తే అడవిలో చాలా జంతువులకు బయం అనే విషయం తెలిసిన విషయమే. ఏదైనా జంతువు దానికంటే పెద్ద, బలమైన జంతువు కనిపిస్తే.. బయపడి పరుగులు తీస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొన్ని జంతువులు మాత్రం తనకన్నా బలమైన జంతువులను చూస్తే కానీస బయం కూడా లేకుండా వాటిని ఎదిరిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్​లో హల్​చల్​ చేస్తోంది.


అసలు విషయం ఏమిటంటే..


మట్టి రోడ్డుపై ఓ శునకం పడుకుని ఉండగా.. పక్కన్నే ఉన్న పొదల్లోంచి చిరుత పులి కుక్క ముందుకు జంప్ చేసింది. అయితే కుక్క ఒక్క సారిగా ఉలిక్కిపడి పైకి లేచింది. కానీ చిరుతను చూసి ఆ కుక్క ఏ మాత్రం బయపడకుండా.. దానికి ఎదురుగా నిలబడింది.


గట్టిగా అరుస్తూ చిరుతను బెదిరించేందుకు ప్రయత్నించింది. అలా కొన్ని క్షణాలు అరుస్తూనే ఉండగా ఆ చిరుత కుక్కపై దాడి చేయకుండా పక్కకు తప్పుకుంది.


ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్​ శరన్ ట్విట్టర్​లో​ షేర్​ చేశారు. ఈ వీడియోకు.. ఎంతకి క్లిష్ట పరిస్థితి వచ్చిన విశ్వాసం మాత్రం కోల్పోవద్దు అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.05 లక్షల మందికి పైగా చూశారు.



నిజమే కదా.. చిరుత దాడి చేస్తే ఆ శనకానికి దానిని ఎదిరించడం చేతకాదు. కానీ దాని అరుపుతో చిరుతను బెదిరించి ప్రాణాలు కాపాడుకుంది. అలా కాకుండా చిరుతను చూసి పరిగెత్తి ఉంటే.. చిరుత దాన్ని వెంటాడి చంపేది. అందుకే ఆత్మ విశ్వాసం ఉండాలే గానీ ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా.. సులభంగా దానిని ఎదుర్కోగలం అని ఈ వీడియో చూస్తే మరోసారి రుజువవుతోంది.


Also read: Viral Video: పెళ్లి కూతురు ముస్తాబు చూసి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు!


Also read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook