BrideGroom Starts Dancing in mandapam when he heard the song and music Video goes viral: ప్రస్తుతం పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొత్త పెళ్లికొడుకులు, పెళ్లి కూతుర్లు ఈ మధ్య పెళ్లిళ్లలో స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో కూడా అలాంటిదే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి కొడుకు (BrideGroom) జోష్ మామాలుగా లేదండోయ్.. పెళ్లి మండపంలోనే అబ్బాయి స్టెప్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పెళ్లి కూతురు వద్దంటూ అతన్ని వారించింది. కానీ పక్కనే వినిపిస్తోన్న భోజ్‌పురి పాట, మ్యూజిక్‌కు పెళ్లి కొడుకు మండపంలో కూర్చొనే డ్యాన్స్ (BrideGroom Dance) చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు పంతులు మంత్రాలు చదువుతూ పెళ్లి తంతంగాన్ని జరిపిస్తుంటే కూడా పెళ్లి కొడుకు బాడీ మాత్రం స్టెప్స్ తో షేక్ అయిపోతూ ఉంటుంది. భుజాలను కదిలిస్తూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు పెళ్లికొడుకు.


ఇక చివరికి పెళ్లి మండపం (Wedding hall) నుంచి సైడ్ కొచ్చి మ్యూజిక్‌కు తగ్గట్లుగా స్టెప్స్ ఇరగదీశాడు. పెళ్లికొడుకు వెంటే పంతులుగారు కూడా మంత్రాలు చదువుతూ.. స్టెప్స్ వేస్తూ పెళ్లి తంతంగాన్ని జరిపించేశాడు. వరుడు వస్తూవస్తూ తనను వారిస్తున్న వధువును (Bride) కూడా లాక్కోచ్చాడు. వధువు కూడా వరుడితో పాటు స్టెప్స్ వేసింది. ఇక వీడియో మస్త్ ఫన్నీగా, ఎంటర్‌‌టైన్‌మెంట్‌గా (Entertainment) ఉంది.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Your Fun Zone (@yourfunzone)


 


Also Read : Omicron: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!


వధూవరులతో పాటు పంతులు కూడా సరదాగా డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. యువర్ ఫన్ జోన్ అనే హ్యాండిల్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఈ వీడియో షేర్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు జనాలకు భలే నచ్చుతోంది. లైక్స్, కామెంట్స్‌తో వీడియో (Video) సోషల్ మీడియాలో (Social media) ట్రెండ్ అవుతోంది. ఈ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ.. పెళ్లికొడుకు మస్తు సంతోషంగా ఉన్నట్లుండు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook