Cats Vs Snakes Fighting Videos: జంతువుల్లో ఏ జీవికి ఉండే స్వభావం వాటికి ఉంటాయి. ఎంత సాధు జంతువైనా.. తనకి ఏదైనా హానీ ఎదురయ్యే ప్రమాదం ఉందనే సంకేతాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తం అవుతుంది. ఆ వెంటనే దాని సాధు గుణం కోల్పోయి ఆ జీవికి ఉండే ఒరిజినాలిటీ బయటికొస్తుంది. సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కలు ఎంత మృధు స్వభావంతో ఉంటాయో తెలిసిందే. యజమానిని చూడగానే తోక ఆడిస్తూ, యజమానిపై తమకున్న అభిమానాన్ని వాటి చేష్టలతో అవి తెలియజేస్తుంటాయి. అప్పుడు అవి సాధు జంతువులుగానే కనిపిస్తాయి. కానీ తమకు సమీపంలో ఏదైనా ముప్పు పొంచి ఉందని గ్రహించినప్పుడు వాటి తీరు ఎలా ఉంటుందో చూడండి. అలాంటి సందర్భంలోనే పిల్లి కూడా పులిలా రియాక్ట్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు మేము మీకు చూపించబోయే ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. మూడు వేర్వేరు సందర్భాల్లో మూడు వేర్వేరు పిల్లులకు , వేర్వేరు పాములకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్స్ వీడియోలను ఒక్కచోట చేర్చి సింగిల్ వీడియోగా తయారు చేసి ఎవరో ఒక నెటిజెన్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ఐదు రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షలకుపైగా నెటిజెన్స్ వీక్షించారు. మరో 21200 మందికి పైగా నెటిజెన్స్ ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాదండోయ్... 2600 మందికి పైగా నెటిజెన్స్ ఈ వీడియోను తమ ఖాతాల్లో రీపోస్ట్ చేశారు. దీంతో క్యాట్స్ vs స్నేక్స్ జరిగిన ఈ ఫైటింగ్ సీన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నాగు పాము అత్యంత విషపూరితమైన సర్పం. నాగు పాము కాటేస్తే ఆ విషం ప్రభావంతో జంతువులు కూడా మృత్యువాత పడుతుంటాయి. కానీ అంతటి పవర్‌ఫుల్ స్నేక్స్‌తోనూ ఈ వీడియోలో కనిపించిన పిల్లులు ధైర్యంగా వెన్ను చూపకుండా కొట్లాడటం ఎంతో సాహసోపేతంగా కనిపించింది. అంతేకాదు.. తనని కాటేసేందుకు మీది మీదికొస్తున్న నాగు పామును కిక్ బాక్సింగ్ చేసినంత ఈజీగా గాల్లోకి ఎగిరి ఎగిరి మరీ పంచ్ లిస్తూ అదిరిపోయేలా చేశాయి. మొదట ఆ పిల్లులను కాటేసి కసి తీర్చుకునేందుకు విఫల యత్నం చేసిన ఆ పాములు.. చివరకు తోక ముడిచి పారిపోక తప్పలేదు. వీడియో చూస్తే పిల్లులే పై చేయి సాధించినట్టుగా అర్థం అవుతోంది. 



 


ఎటొచ్చి ఈ వీడియోలో స్పష్టంగా అర్థం కానీ విషయం ఏంటంటే.. పాముల దాడిలో పిల్లులకు ఒక్క పాము కాటు కూడా పడలేదా అనేదే క్లారిటీ లేదు. లేదంటే తాత్కాలికంగా ఆ పాములు తోక ముడిచి పారిపోయినప్పటికీ.. ఒకవేళ పాము కాటు బారిన పడి ఉంటే పాపం ఆ పిల్లులకు అది ప్రాణ గండమే అవుతుంది అని నెటిజెన్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఇది కూడా చదవండి : Man playing With Snakes: షర్ట్ విప్పేసి ఒంటినిండా పాములతో పరాచికాలు.. వీడియో వైరల్


ఎందుకంటే పాములంటే చాలా మందికి ఒక రకమైన భయం.. పిల్లులు అంటే పెంపుడు జంతువులే కదా అనో లేక సాధు జంతువులే కదా అనే జంతు ప్రేమ ఉంటుంది. అందుకే కొంతమంది జంతు ప్రేమికులు ఈ వీడియో చూసి " పాపం పాముల దాడిలో గాయపడిన పిల్లుల పరిస్థితి ఏంటో " అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజెన్స్ ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చూసిన ఈ వీడియో కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇలాంటి మరిన్ని ఆకట్టుకునే వైరల్ వీడియోస్ కోసం జీ తెలుగు న్యూస్ సోషల్ సెక్షన్ ఫాలో అవుతూ ఉండండి. 


ఇది కూడా చదవండి : Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి