China Viral Video: చైనాలో మళ్లీ కొవిడ్-19 విజృంభిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం చైనా సర్కారు రెండేళ్ల కిందట విధించినట్టే బలవంతపు కర్ఫ్యూలు, క్వారంటైన్లు విధించినప్పటికీ ఫలితం లేకపోయింది. కర్ఫ్యూలకు వ్యతిరేకంగా చైనా ప్రజలు తిరగబడి రోడ్డెక్కి ధర్నాలు చేయడంతో అక్కడి ప్రభుత్వానికి ఆంక్షలు కొంత సడలించక తప్పలేదు. కానీ పరిస్థితి చేయి దాటిపోతుందని అనుకున్నప్పుడల్లా ప్రభుత్వం అక్కడి ప్రజలపై బలవంతపు ఆంక్షలు రుద్దుతూనే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా చైనాలో పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందో అర్థం చేసుకోవడానికి అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తిని చైనీస్ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తమ సిబ్బంది సహాయంతో బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల కిందినాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా మరోసారి చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 34,772 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య 32,827 గా నమోదైంది. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ గణాంకాలు, ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. 



 


అందుకే కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చైనా వాసులపై బలవంతపు ఆంక్షలు రుద్దడానికైనా చైనా సర్కారు వెనుకాడటం లేదు. శుక్రవారం వరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 32 వేల వరకు ఉండగా.. 5,233 మంది కరోనావైరస్ సోకి చనిపోయారు. ఇవి తాజాగా నమోదైన గణాంకాలు మాత్రమే. దీంతో పరిస్థితి ఇలాగే వదిలేస్తే.. మళ్లీ పాత రోజులు చూడాల్సి వస్తుందని చైనా సర్కారు భయపడుతోంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ప్రపంచం ఏమో కానీ చైనా వాసులు మాత్రం హడలిపోతున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంత సద్దుగణుగుతున్నాయనుకుంటే.. మళ్లీ తమ పరిస్థితి ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం కావాల్సి వస్తుందా అనే ఆందోళన చైనా వాసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు సంఖ్య ఇలాగే పెరుగుతుపోతే చైనా ప్రభుత్వం ( China COVID-19 cases ) తీసుకునే నిర్ణయాలను ఏ ఆందోళనలు, ధర్నాలు ఆపలేవు కదా అనేది వారి భయం.


Also Read : School teacher dance: బూతు పాటపై స్కూల్ పిల్లలతో టీచర్ డాన్స్


Also Read : Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. తొక్కుడే తొక్కుడు.. వీడియో వైరల్


Also Read : Electric Cycle Video: 6 సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్.. తొక్కాల్సిన పనే లేదు.. వైరల్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook