Cloudburst Video: గంటసేపు కురవాల్సిన వర్షం.. కొన్ని క్షణాల్లోనే కురిసిందిగా! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు
Slowly Moving clouds suddenly pour water. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మేఘం ఒక్కసారిగా నీళ్లు కుమ్మరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Slowly Moving clouds suddenly pour huge water in river: ప్రపంచాన్ని అరచేతిలో చూపించేదే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతులు, ప్రకృతికి సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మేఘం ఒక్కసారిగా నీళ్లు కుమ్మరించింది.
ఆస్ట్రియాలోని మిల్‌స్టాట్ సరస్సుకు రెండు వైపులా పర్వతాలు ఉన్నాయి. అప్పటి వరకు నిర్మానుశ్యంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. సరస్సు చుట్టుపక్కలా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. సరస్సుపై నల్లటి మబ్బులు వేగంగా కదులుతూ వచ్చాయి. ఉన్నట్టుండి మేఘాల్లోని నీరు ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసింది. గంటసేపు కురవాల్సిన వర్షం.. కొన్ని క్షణాల్లోనే కురిసినట్టుగా పడింది. మొత్తం వర్షం ఒకే దగ్గర కురిసింది. దాంతో మిల్‌స్టాట్ సరస్సు ఒక్కసారిగా నీతితో నిండిపోయింది.
'వండర్ ఆఫ్ సైన్స్' అనే ట్విట్టర్ హాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 'ఆస్ట్రియాలోని మిల్‌స్టాట్ సరస్సుపై అద్భుతమైన మేఘ విస్ఫోటనం జరిగింది. ఫోటోగ్రాఫర్ పీటర్ మేయర్ ఈ అద్భుత వీడియోను తన కెమెరాలో బంధించాడు' అని వీడియోకి కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి లక్షల్లో లైకులు వచ్చాయి. ఇలాంటి దృశ్యంను ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మేఘాలు ఇలా ఉన్నట్లుండి ఒక్కసారిగా కురవడాన్ని'క్లౌడ్ బర్ట్స్' అని పిలుస్తుంటారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. సాధారణంగా మేఘాలు భూఉపరితలం నుంచి 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు క్లౌడ్ బర్ట్స్ సంభవిస్తాయి. ఇలాంటి ఘటనలు కేవలం పర్వతాల దగ్గరే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ సంభవిస్తుంటాయి.
Also Read: Deepika Padukone Fan: 'ఐ లవ్ యూ' చెప్పిన ఫ్యాన్.. దీపికా పడుకోణె షాకింగ్ రిప్లై!
Also Read: The Warriorr Pre Release Event: 'రామ్' సినిమా కోసం 28 మంది అతిథులు.. జాబితా ఇదే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook