Deepika Padukone Fan: 'ఐ లవ్ యూ' చెప్పిన ఫ్యాన్.. దీపికా పడుకోణె షాకింగ్ రిప్లై!

Deepika Padukone funny reply to Lady Fan. కొంకణి సమ్మేళన్ కోసం దీపికా పదుకోణె వేదికపైకి వెళుతున్న సమయంలో అక్కడున్న భారత అభిమానులు.. దీపికా దీపికా అంటూ  అరుస్తూ చప్పట్లతో స్వాగతించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 6, 2022, 07:51 PM IST
  • ఐ లవ్ యూ దీపికా పడుకోణె
  • దీపికా పడుకోణె షాకింగ్ రిప్లై
  • ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా
Deepika Padukone Fan: 'ఐ లవ్ యూ' చెప్పిన ఫ్యాన్.. దీపికా పడుకోణె షాకింగ్ రిప్లై!

Deepika Padukone funny reply to Lady Fan: దీపికా పదుకోణె.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస ఆఫర్లతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. వివాహం తర్వాత కూడా దీపికా 'గెహ్రైయాన్' లాంటి రొమాంటిక్ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలోని బికినీలో అందాలు ఆరబోయడం మరియు లిప్ కిస్సింగ్ సీన్స్‌పై భిన్న రకాల కామెంట్స్ వచ్చినా.. అవేమీ పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' సినిమాలో దీపికా పదుకోణె నటిస్తున్నారు. బాలీవుడ్‌లో పఠాన్, సర్కస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పొడుగుకాళ్ల సుందరి కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం యుఎస్‌లో ఉన్న దీపికా భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాకాలో ఉన్న ఈ స్టార్ జంట శంకర్ మహదేవన్ కాలిఫోర్నియా సంగీత కచేరీకి కూడా వెళ్లారు. ఇటీవల జరిగిన కొంకణి సమ్మేళన్‌కు కూడా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రణవీర్ సింగ్‌తో కలిసి వెళ్లిన దీపికా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

కొంకణి సమ్మేళన్ కోసం దీపికా పదుకోణె వేదికపైకి వెళుతున్న సమయంలో అక్కడున్న భారత అభిమానులు.. దీపికా దీపికా అంటూ  అరుస్తూ చప్పట్లతో స్వాగతించారు. ఓ లేడీ అభిమాని 'వి లవ్ యు' అని గట్టిగా అరవగా.. 'నేను ఇప్పుడు వివాహితను' (ఐయామ్ మ్యారీడ్ విమెన్ నవ్) అని సరదాగా బదులిచ్చారు. ఇది విన్న అక్కడున్న వారందరూ నవ్వులు పూయించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: The Warriorr Pre Release Event: 'రామ్' సినిమా కోసం 28 మంది అతిథులు.. జాబితా ఇదే!

Also Read: Joe Root Record: విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లను దాటేసిన జో రూట్.. సచిన్‌ రికార్డు కష్టమేమీ కాదు!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News