కరోనా వైరస్ (CoronaVirus) ప్రభావం తొలి రోజుల్లో అధికంగా ఎదుర్కొన్న దేశాల్లో ఇంగ్లాండ్ ఒకటి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన  శిక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నారు. కోవిడ్19 (COVID19) నిబంధనల ఉల్లంఘనులకు భారీ జరిమానాలతో షాకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరు మీద మనసు లాగిన ఓ పెద్దాయన ఏకంగా రూ.4.3 లక్షలు (5 వేల యూరోలు) జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. భారీ జరిమానాకు లబోదిబో మన్నాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తప్పలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!


79 ఏళ్ల హెన్రీ మెక్ కార్తీ ఇటీవల యూకే మెయిన్ ల్యాండ్ నుంచి గెర్న్‌సీకి వచ్చాడు. కోవిడ్19 నిబంధనలు అమలులో ఉన్నాయని, రెండు వారాల పాటు కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. అయితే ఓ రోజు తనిఖీకి వెళ్లగా ఇంట్లో హెన్రీ మెక్ కార్తీ కనిపించలేదు. ఎలాగోలా పోలీసులు కొంత సమయానికే ఆ పెద్దాయన ఎక్కడికి వెళ్లారో తెలుసుకున్నారు. ఓ పబ్ ముందు ఆయన కారును గుర్తించారు పోలీసులు.


Also Read : COVID19: డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్


లోపలికి వెళ్లి చూడగా ఎంచక్క బీరు తాగుతూ ఉల్లాసంగా కనిపించాడు హెన్రీ. అయితే కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించారంటూ పెద్దాయనను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు పోలీసులు. తన క్లయింట్ పబ్‌లో భౌతికదూరం పాటించాడని హెన్రీ తరఫు లాయర్ వాదించినా ప్రయోజనం లేకపోయింది. అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లడమే కోవిడ్19 నిబంధలు ఉల్లంఘించడమేనని, వాదనలు అనవసరమంటూ హెన్రీ మెక్ కార్తీకి 5 వేల యూరోలు (భారత కరెన్సీలో రూ.4.3 లక్షలు) జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గ్రేమ్ మెకెరల్ తీర్పునిచ్చారు.


Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe