Python Snake Viral Video: తప్ప తాగి కొండ చిలువను మెడకు చుట్టుకున్న వృద్ధుడు..చివరికి ఆ పాము ఏం చేసిందో తెలుసా? వీడియో చూడండి..
Huge Python Snake Viral Video: ప్రస్తుతం తాగుబోతులు చేసిన కొన్ని వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి తప్ప తాగి కొండచిలువను మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Huge Python Snake Viral Video: కొంతమంది తాగుబోతులు చేసే వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇవి నవ్వు తెప్పించడమే కాకుండా అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కొంతమంది తాగుబోతులు మద్యం మత్తులో చాలామంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొందరిలో ఇలాంటి ప్రవర్తన ప్రాణాల మీదికి వస్తుంది. తాజాగా ఓ వృద్ధుడు మద్యం మత్తులో పాముతో రోడ్డుపై వీరంగం సృష్టించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ తాగుబోతు కొండచిలువను పట్టుకొని కొండచిలువను పట్టుకొని రోడ్డుపై చేసిన వింత చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో తాగుబోతు చేసిన విన్యాసాలు ఏంటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఓ తాగుబోతు రోడ్డుపై వెళ్తున్న భారీ కొండచిలువను భుజాన వేసుకొని రోడ్డుపై హల్చల్ చేస్తూ అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్ళాడు. అయితే దీనిని గమనించిన ఆ పెట్రోల్ బంకు సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. మరికొంతమంది అయితే కేకలు వేస్తూ ఆ వృద్ధున్నే చూస్తుండిపోయారు. ఈ ఘటన కేరళలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొండచిలువలు కొండ చిలువలు భారీ ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఒక్కసారి మన శరీరాన్ని పట్టేసుకుంటే వదలకుండా ఉంటాయి. ఆ వృద్ధుని కొండచిలువ ఏం చేసిందో తెలుసా?
కన్నూర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో తప్ప తాగాడు అనంతరం రోడ్డుపై వెళ్తున్న కొండచిలువను పట్టుకొని మద్యం మత్తులో విన్యాసాలు చేశాడు. అయితే చాలామంది అతన్ని కొండచిలువను విడిపించేందుకు ప్రయత్నాలు చేసిన ఏమాత్రం తగ్గకుండా ఆ పామును డైరెక్ట్ మెడలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఈ కొండచిలువను నేను మెడలో వేసుకుంటాను నన్ను ఫోటోలు తీయండి అంటూ పెట్రోల్ బంక్ సిబ్బందిని కేకలు వేస్తూ అడిగాడు. దీంతో ఆ సిబ్బంది ఆయనను చూసి పరుగులు పెట్టారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
అంతేకాకుండా ఆ తాగుబోతు చేసిన వింత చేష్టలకి కొండచిలువ కూడా భయపడిపోయింది ఆ పాము ఎంతగానో భయపడిపోయి ఆ చంద్రమోహన్ మెడకు గట్టిగా చుట్టుకుంది. అయితే ఆ భారీ కొండచిలువ గొంతు గట్టిగా నొక్కి పట్టి ఉంచడంతో ఆయన సడన్గా కింద పడిపోయాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది స్పందించి ఆయనను కాపాడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి కొంతమంది కలిసి చంద్రమోహన్ మెడ నుంచి పామును విడిపించి.. ఆయనను ఇంటికి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన నటిజన్స్ వీడెవడు రా బాబు అని అంటున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter