Dog Travels In Mumbai Local Train: తరచుగా సోషల్ మీడియాలో మెట్రో రైల్, లోకల్ ట్రైన్ లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముంబై లోకల్ ట్రైన్ నికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను నేటిజన్లు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసా.. మీరు కూడా ఈ వీడియో చూస్తే తెగ ఆనందపడతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై లోకల్ ట్రైన్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని రైల్వేస్టేషన్లో కూడా రైలు సరిగా ఆగదు.. దీన్ని గమనించిన కొందరు కదులుతున్న రైలులోకి కూడా జంప్ చేసి ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. రద్దీగా లేని సమయాల్లో లోకల్ ట్రైన్ లో కుక్కలు కూడా ప్రయాణిస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ ప్రయాణికుడు కుక్క ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కు ప్రయాణించిన వీడియోను తీసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.




ఈ కుక్కను చూసిన నటిజెన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రయాణికులే ట్రైన్ రన్ అవుతున్నప్పుడు దిగే క్రమంలో కాలు జారి పడుతూ ఉంటారు. అయితే ఈ కుక్క మాత్రం ఎలాంటి భయం లేకుండా ఒక్కసారిగా ప్లాట్ఫారం మీదికి జంప్ చేసింది. ఇలా రన్నింగ్ లోకల్ ట్రైన్ లో జంప్ చేయడం అతి కష్టమైనప్పటికీ కుక్క ఎంత చాకచక్యంగా ప్లాట్ఫారం మీదికి దూకేసిందో మీరందరూ చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు జంప్ చేస్తే పక్కా పడేవారని నెటిజెన్లు అంటున్నారు. 


Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం  



అయితే ఈ వీడియోని చూసిన కొందరు నటిజెన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. "కుక్క ఎంతో తెలివిగా తన గమ్యాన్ని చేరుకుందని, జంతువులు కూడా మనుషుల లాగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని" ఓ ప్రయాణికుడు కామెంట్ రాసుకోవచ్చాడు. మొదటగా ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ తర్వాత దీనిని మదర్ ఎర్త్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ట్విట్టర్లో ప్రస్తుతం ఈ వీడియోను 500 మందికి పైగా వీక్షించారు.


Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook