Dog vs Frog Video: కప్ప ధాటికి తోక ముడిచిన శునకం- వైరల్ వీడియో
Dog vs Frog Video: సాధారణంగా శునకం, కప్ప మధ్య జరిగే యుద్ధాలలో శునకాలదే పైచేయి! అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోలో శునకంపై కప్ప ఆధిపత్యం చలాయిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి.
Dog vs Frog Video: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటుంది. అందులో ఎక్కువగా ఫన్నీ వీడియోస్ తో పాటు జంతువుల మధ్య పైటింగ్ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అలాంటి వీడియోలు చూసేందుకు ఆసక్తిగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫైటింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ చిన్న కప్ప.. శునకంపై ఎగబడుతుంది. కప్ప దాడికి శునకం కూడా భయపడినట్లు వీడియోలో తెలుస్తోంది. ఇంకా ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ కప్ప, శునకంపై గొడవ పడుతుంది. సాధారణంగా శునకం, కప్ప మధ్య జరిగే యుద్ధంలో శునకమే పైచేయి సాధిస్తుంది. కానీ, ఈ వీడియోలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందుగా శునకం.. కప్పపైకి వస్తుంది. దాంతో గట్టిగా అరుస్తూ కప్ప కూడా ప్రతిదాడి చేస్తుంది. తొలుత కొంత భయపడిన కప్ప.. ఆ తర్వాత మళ్లీ శునకంపై దాడికి తెగబడుతుంది. అయితే ఈ వీడియోలో కప్ప పడే పాట్లకు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
నెట్టింట ట్రెండింగ్..
ఈ 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 50 వేలకు పైగా వ్యూస్ లభించాయి. శునకంతో జరిగిన యుద్ధంలో కప్ప ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ALso Read: Whatsapp messages: వాట్సాప్‌లో ఆ మెసేజ్ కోసం వెతుకుతున్నారా ?
Also Read: Noodles Pani Puri: పానీ పూరిని ఇలా కూడా తింటారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త రెసిపీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook