COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని సౌత్ కెరోలినాలో ( South Carolina ) ఒక గద్ద చేపను ఎత్తుకెళ్లింది. అయితే ఇందులో విశేషం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గద్ద ఎత్తుకెళ్లింది మామూలు చేపను కాదు సొరచేపను ( Eagle Carrying Shark ) . ఈ వీడియోను చూసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అవాక్కవుతున్నారు. కొంత మంది కలికాలం అంటుండగా.. కొంత మంది ఆకలి మహత్యం అని అంటున్నారు. అయితే ఈ వీడియోను తీసిన యాష్లీ వైట్ (Ashely White From South Carolina ) అనే మహిళ కూడా  ముందు దీన్ని నమ్మలేకపోయింది. Read Also : Harbhajan Singh Birthday: హర్భజన్ సింగ్.. హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్


సౌత్ కెరోలినాలోని మెర్టైల్ బీచ్లో ( South Carolina Myrtle Beach ) ప్రశాంతంగా తన భవనంలో చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్న ఆమెకు ఆకాశంలో ఒక గద్ద కనిపించింది. దాని కొరలో ఒక చేప ఉండటంతో ఇలాంటి సీన్ చాలా అరుదుగా కనిపిస్తుంది అని తన మొబైల్లో వీడియో రికార్డు చేయడం ప్రారంభించింది. జాగ్రత్తగా గమనిస్తే అది మామూలు చేపకాదు సొరచేప ( Shark ) అని తెలిసి షాక్ అయింది. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేసింది. వెంటనే అది వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కోటి 44 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో గద్ద కొరల ( Shark Become Eagle Prey ) నుంచి తప్పించుకోవడానికి సొరచేప ప్రయత్నించడాన్ని మీరు కూడా చూడవచ్చు. 




జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..