New IT Rules: కొత్త ఐటీ నిబంధనల్ని అమలు చేసిన గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు
New IT Rules: దేశంలో కొత్త ఐటీ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని పాటించే దిశగా నడుస్తుంటే ట్విట్టర్‌తో వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు నివేదిక వెలువరించాయి.
New IT Rules: దేశంలో కొత్త ఐటీ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని పాటించే దిశగా నడుస్తుంటే ట్విట్టర్‌తో వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు నివేదిక వెలువరించాయి.
దేశంలో మే 26వ తేదీ నుంచి కొత్తగా ఐటీ నిబంధనలు(New IT Rules) అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన సోషల్ మీడియా సంస్థలు తమ తమ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న కంటెంట్ పారదర్శకత పాటించడంతో పాటు నెలవారీ నివేదికలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలపై ట్విట్టర్ అంగీకరించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో (Central government) ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. అదే సమయంలో ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రం తొలిసారి కొత్త ఐటీ నిబంధనల్ని అమలు చేస్తూ నివేదికలు విడుదల చేశాయి.ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు ఐటీ నిబంధనల్ని అమలు చేయడంతో కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా లేని పోస్టుల్ని స్వచ్ఛంధంగా తొలగించడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union minister Ravisankar prasad) హర్షం వ్యక్తం చేశారు.
కొత్త ఐటీ నిబంధనల ప్రకారం మే 15 నుంచి జూన్ 15 మధ్య మొత్తం 10 కేటగరీల్లో 30 మిలియన్ల కంటెంట్ తొలగించినట్టు ఫేస్‌బుక్ (Facebook) తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్(Instagram) అయితే 2 మిలియన్ల కంటెంట్ తొలగించింది. ఇక గూగుల్ సంస్థ 59 వేలకు పైగా కంటెంట్ తొలగించినట్టు నివేదికల్లో వెల్లడించాయి.
Also read: WhatsApp New Feature: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ View Once
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook