వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India ) కూడా ఉంది. చాట్స్ నుంచే షాపింగ్ చేసి చెకౌట్ చేసే అవకాశం కల్పించింది. అందుబాటులో ఉన్న సేవలను, వస్తువులను తెలుసుకుని వాటిని వెంటనే వినియోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే


షాపు ముందుభాగంలా కనిపించే బోర్డులా ఉండే ఈ బటన్ ను చూసినప్పుడు అందులో వ్యాపారానికి, షాపింగ్ కు సంబంధించిన అంశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చాటింగ్ మధ్యలోనే షాపింగ్ చేస్తూ వస్తువులను ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది అని వాట్సాప్ ( WhatsApp ) తెలిపింది. అదే సమయంలో వ్యాపారులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. వారి ఉత్పత్తులు త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంది.



Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట


ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. ప్రతీ రోజు సుమారు 175 మిలయన్ల మంది వాట్సాప్ బిజినెస్ ఎకౌంట్ ను ( WhatApp Business Account ) వినియోగిస్తున్నారు. ఇందులో 40 మిలియన్ల మంది బిజినెస్ కేటలాగ్ ను చూస్తుంటారు. ఇందులో 3 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉన్నారు.



Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR