Facebook, Whatsapp, Instagram Services Restored: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఊపిరిపీల్చుకున్నారు. 7 గంటలసేపు ప్రపంచవ్యాప్తంగా స్థంబించిన సేవలు తిరిగి రీస్టోర్ అయ్యాయి. అసలేం జరిగింది. 7 గంటలసాపు యూజర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా. ఇప్పుడొక వ్యసనంగా మారిపోయింది. చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే ఉండే వెలితి కంటే..సోషల్ మీడియా పనిచేయకపోతే ఉండే వెలితే ఎక్కువ. ముమ్మాటికీ నిజమిది. వాట్సప్,ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా వేదికలకు జనం అంతలా అలవడిపోయారు. పనిచేయకపోతే కొంపలేమీ అంటుకోకపోయినా..ఏదో ఉపద్రవం ముంచుకొచ్చేసినట్టుగా ఫీలవుతుంటారు. అదే జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 గంటలసేపు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో(Facebook, Whatsapp, Insta services outage)జనం చాలా ఇబ్బందులు పడ్డారు. అక్టోబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల్నించి..5వ తేదీ ఉదయం 4 గంటల వరకూ ఇదే పరిస్థితి. 


ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమాల్లో మెస్సేజ్‌లు వెళ్లకపోవడం, కొత్త పోస్టులు కన్పించకపోవడం ఇలా ఏకంగా 7 గంటలసేపు ఇబ్బంది ఎదురైంది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే వేదికలు పనిచేయకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వాట్సప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయకపోవడంతో పెద్ద సంఖ్యలో మీమ్స్ వైరల్ అయ్యాయి.ఫేస్‌బుక్, వాట్సప్(Whatsapp), ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడానికి కారణం సర్వర్లు డౌన్ అవడమేనని ఫేస్‌బుక్ అంగీకరించింది. త్వరలో సేవల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. దాదాపు 7 గంటల తరువాత అంటే ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్(Instagram)సేవలు రీస్టోర్ అవడంతో(Facebook, whatsapp, Instagram services restored) యూజర్లు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.


Also read: WhatsApp, facebook and instagram: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్స్ డౌన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook