Covid-19 Vaccine News | ఇది డిజిటల్ యుగం నిజం తలుపు దాటే ముందు అబద్ధం కిటికీలోంచి వేగంగా వెళ్లిపోతుంది అన్నట్టు అసత్య ప్రచారాలు నిజమైన వార్తల కన్నా వేగంగా దూసుకెళ్తుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త పడకుండా ఉంటే, అప్రమత్తంగా ఉండకుంటే వాటి వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!


అలాంటి ఒక మెసేజ్ ఇటీవలే సోషల్ మీడియాలో ( Social Media ), వాట్సాప్ లో బాగా షేర్ అవుతోంది. అందులో ఇలా రాసి ఉంది.
భారత దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేంది.
మీ నెంబర్ రిజిస్టర్ చేసుకోండి.
వెంటనే వ్యాక్సిన్ కోసం అప్లై చేసుకోండి.
వ్యాక్సిన్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. 
ఇప్పుడే అప్లై చేయండి అని అందులో ఉంది.



Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి


ఈ వాట్సాప్ మెసేజ్ ఫేక్ అంటే ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో ( PIB ) తెలిపింది.  భారత దేశంలో ఇప్పటి వరకు కోవిడ్-19 రాలేదు అని స్పష్టం చేసింది.



మరి వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి ?
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19) కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన మోడర్నా, ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్లు తయారు అయ్యాయి అని వాటిని అక్కడి ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది అనేది తాజా వార్త. మరోవైపు భారత దేశంలో కొన్ని సంస్థలు తయారు చేస్తున్న టీకాలు మూడవ దశలో ఉన్నాయి.


Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!


రష్యాకు చెందిన వ్యాక్సిన్ స్పూత్నిక్ వీ భారత దేశంలో పలు టెస్టుల తరువాతే అందుబాటులోకి రావచ్చు. ఇలాంటి సమయలో టీకా వచ్చింది అని ఎవరైనా మెసేజ్ లు పంపిస్తే నమ్మకండి. అప్రమత్తంగా ఉండండి. ఆపదలకు దూరంగా ఉండండి. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR